పోలీసు వృత్తి సామాజిక బాధ్యత : సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్

 పోలీసు వృత్తి సామాజిక బాధ్యత : సిటీ కమిషనర్ వీసీ సజ్జనార్
  • సిటీ కమిషనర్​ వీసీ సజ్జనార్

జూబ్లీహిల్స్, వెలుగు: పోలీసు వృత్తి విధి నిర్వహణ మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని సిటీ కమిషనర్​ వీసీ సజ్జనార్​ అన్నారు. నగర చరిత్రలో తొలిసారిగా పోలీసులకు ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా మైల్’ పురస్కారం, ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులను ఆయన అందజేశారు. ఆదివారం బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివిధ పోలీసు అధికారులతో కలిసి ఆయన ఈ అవార్డులను ప్రదానం చేశారు.

విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 271 మందికి పురస్కారాలు, ఉత్తమ సేవలు అందించిన 1,175 మందికి రివార్డులు అందజేశారు. పోలీసుల అసాధారణ ప్రతిభ, వినూత్న ఆలోచనలను గుర్తించేందుకే ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రా మైల్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని సజ్జనార్​ చెప్పారు.