Jasprit Bumrah: ఆసియా కప్‌కు బుమ్రా దూరం.. బరిలోకి దిగేది అప్పుడేనా..

Jasprit Bumrah: ఆసియా కప్‌కు బుమ్రా దూరం.. బరిలోకి దిగేది అప్పుడేనా..

ఆసియా కప్ 2025 ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం బుమ్రా అక్టోబర్ 19 నుంచి జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ అతనికి రేసర్ ఇవ్వనున్నట్టు సమాచారం. నెల రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ లోపు బుమ్రాను హడావిడిగా ఆసియా కప్ ఆడించి రిస్క్ చేసే ఆలోచనలో బీసీసీఐ లేనట్టు తెలుస్తోంది. ఆసియా కప్ తర్వాత స్వదేశంలో టీమిండియా వెస్టిండీస్ తో రెండు టెస్ట్ ల మ్యాచ్ కు అందుబాటులో ఉండకపోవచ్చు.

సెప్టెంబర్ 29న ఆసియా కప్ ముగిసిన వెంటనే.. అక్టోబర్ 2న అహ్మదాబాద్ లో విండీస్తో తొలి టెస్ట్ మొదలవుతుంది. అక్టోబర్ 10-14వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్ తర్వాత భారత జట్టు వన్డే, టీ20 ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఆసీస్ తో జరగబోయే ఈ ఛాలెంజింగ్ సిరీస్ కు బుమ్రా అందుబాటులో ఉండొచ్చు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్ట్ నుంచి   బుమ్రాను అధికారికంగా జట్టు నుండి విడుదల చేసినట్లు బీసీసీఐ శుక్రవారం ధృవీకరించింది. బుమ్రా పనిభారాన్ని మూడు మ్యాచ్‌లకు పరిమితం చేయాలనే యాజమాన్యం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంది. 

31 ఏళ్ల బుమ్రా మొదటి మూడు టెస్ట్‌లలో 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. హెడింగ్లీ, లార్డ్స్‌లో ఐదు వికెట్ల హాల్ ఉన్నాయి. ఇంగ్లండ్ టూర్ లో పని భారాన్ని పరిగణనలోకి తీసుకునే బుమ్రాను మూడు టెస్టులోనే ఆడించామ ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్ అన్నాడు. ఈ విషయాన్ని అందరూ గౌరవించాలన్నాడు. బుమ్రా లాంటి ప్లేయరు బెంచ్ కు పరిమితం చేయడం చాలా కఠినమైన నిర్ణయమని చెప్పాడు. ఐదో టెస్ట్లో బుమ్రా ఆడతాడని చివరి నిమిషం వరకు భావించినా.. కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ విశ్రాంతికే మొగ్గారు. 

ALSO READ : IND vs ENG 2025: నెక్స్ట్ క్రికెట్ సూపర్ స్టార్ అతడే.. ఇంగ్లాండ్ ప్లేయర్‌ను పొగిడి పరువు పోగొట్టుకున్న అశ్విన్

ఇంగ్లాండ్ సిరీస్ లో బుమ్రా మూడు టెస్టులు ఆడాడు. లీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెస్ట్ తీసుకోగా.. అక్కడ సిరాజ్, ఆకాశ్ దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అద్భుతంగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు. లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ముగిసిన మాంచెస్టర్ టెస్టులో 33 ఓవర్లలో 112 పరుగులు సమర్పించుకున్న బుమ్రా.. ఓవరాల్ గా 33 ఓవర్లలో 112 పరుగులు ఇచ్చి జెమీ స్మిత్, డాసన్ వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్ కెరీర్ లో 47 టెస్టులాడిన బుమ్రా.. 100కి పైగా పరుగులివ్వడం ఇదే తొలిసారి.