IND vs ENG 2025: నెక్స్ట్ క్రికెట్ సూపర్ స్టార్ అతడే.. ఇంగ్లాండ్ ప్లేయర్‌ను పొగిడి పరువు పోగొట్టుకున్న అశ్విన్

IND vs ENG 2025: నెక్స్ట్ క్రికెట్ సూపర్ స్టార్ అతడే.. ఇంగ్లాండ్ ప్లేయర్‌ను పొగిడి పరువు పోగొట్టుకున్న అశ్విన్

జాతీయ జట్టుకు ఎంపికవ్వడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ ఎంపికైనా ఈ జనరేషన్ లో మూడు ఫార్మాట్ లు ఆడడం అత్యంత కష్టం. ప్రస్తుత క్రికెటర్లలో మూడు ఫార్మాట్ లు ఆడుతున్న ప్లేయర్లను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అయితే ఇంగ్లాండ్ యువ క్రికెటర్  జాకబ్ బెథెల్ మాత్రం క్రికెట్ లో శరవేగంగా దూసుకుపోతున్నాడు. రెండు నెలల వ్యవధిలోనే మూడు ఫార్మాట్ లలో అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. ఒక ప్లేయర్ ఇంత ఫాస్ట్ గా మూడు ఫార్మాట్ లు ఆడడం ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ కే చెల్లింది. 

బెతేల్ పై టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ క్రికెటర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆష్ కీ బాత్ యూ ట్యూబ్ ఛానల్ లో అశ్విన్ మాట్లాడుతూ.. " ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగబోయే ఐదో టెస్టులో మనం ఒక సూపర్ స్టార్ ను చూడబోతున్నాం. బెతేల్ మీద నాకు ఎలాంటి సందేహం లేదు. అతను నెక్స్ట్ సూపర్ స్టార్. గొప్ప స్టార్ అవుతాడని అతని మీద నాకు నమ్మకముంది. అద్భుతంగా బ్యాటింగ్  చేయడంతో పాటు బౌలింగ్ లో తనవంతు పాత్ర పోషిస్తాడు". అని అశ్విన్ అన్నాడు. 

ALSO READ : IND vs ENG 2025: సెంచరీతో చెలరేగిన జైశ్వాల్.. 200కు చేరిన టీమిండియా ఆధిక్యం

టీమిండియాతో చివరి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టులోకి స్థానం సంపాదించుకున్న బేతేలును గతంలోనూ అశ్విన్ ప్రశంసించడం విశేషం.   "ఈ తరంలో అద్భుతమైన టాలెంట్" కలిగిన ఆటగాడని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) లైనప్‌లో సరిగ్గా సరిపోతాడని గత ఏడాది డిసెంబర్ లో చెప్పుకొచ్చాడు. ఐదో టెస్టులో అశ్విన్ అంచనా తప్పింది. స్టోక్స్ స్థానంలో ఎన్నో అంచనాల మధ్య చివరి టెస్టు ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించిన బెతేల్ తొలి ఇన్నింగ్స్ లో విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. సిరాజ్ విసిరినా బంతిని సరిగా అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. బౌలింగ్ లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేశాడు.