
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ను తీసుకొచ్చింది. కేవలం రూపాయికే ఒక నెల పాటు 4జీ సేవలను అందిస్తారు. రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు, ఉచితంగా 4జీ సిమ్ కార్డు ఇస్తారు. ఈ ఆఫర్ దేశమంతటా అందుబాటులో ఉంటుంది. కొత్త కస్టమర్లు తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లో ఈ ప్లాన్ను తీసుకోవచ్చు.
కొత్త కనెక్షన్ తీసుకునే వారితో పాటు ఇతర నెట్ వర్క్స్ నుంచి బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యే యూజర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది.