మారుతున్న జీడీపీ లెక్కలు.. జీఎస్టీ, ఈవాహన్ వివరాల జోడింపు

మారుతున్న జీడీపీ లెక్కలు.. జీఎస్టీ, ఈవాహన్ వివరాల జోడింపు
  • ఇవాళ మూడో క్వార్టర్​  డేటా విడుదల

న్యూఢిల్లీ: దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లెక్కింపులో కొత్త మార్పులు రానున్నాయి. బేస్ ఇయర్ 2011-12 నుంచి 2022-23కు మారుతోంది. ఈ కొత్త సిరీస్​ లో జీఎస్​టీ, ఈవాహన్‌‌తో పాటు ఇంటి పనులు చేసే వంట మనుషులు, డ్రైవర్ల సేవలను కూడా చేర్చనున్నారు. దీనివల్ల  ఆర్థిక పరమైన లెక్కలు మరింత కచ్చితంగా ఉంటాయని కేంద్రం భావిస్తోంది.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ జీడీపీ డేటా శుక్రవారం విడుదల కానుంది. సాధారణంగా ఐదేళ్లకు ఒకసారి బేస్ ఇయర్ మార్చాల్సి  ఉన్నా కరోనా, జీఎస్​టీ అమలు వల్ల ఆలస్యమైంది. కొత్త సిరీస్‌‌లో తయారీ, వ్యవసాయ రంగాల్లో డబుల్ డిఫ్లేషన్ పద్ధతిని అమలు చేస్తారు. డబ్ల్యూపీఐ కొత్త బేస్ ఇయర్ ఖరారు అయ్యే వరకు పాతదే కొనసాగుతుంది. 

ఈ మార్పుల ద్వారా జీడీపీ లెక్కల విశ్వసనీయత పెరుగుతుందని కేంద్ర గణాంక శాఖ తెలిపింది.