రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన పీఎం మోదీ

రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేసిన పీఎం మోదీ

పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేశారు పీఎం నరేంద్ర మోదీ. శనివారం (ఆగస్టు 02) వారణాసిలో 20వ విడత నిధుల విడుదల కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 9 కోట్ల 70 లక్షల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. 

శనివారం ఉత్తరప్రదేశ్ లో పర్యటించిన మోదీ.. వారణాసిలో 2 వేల 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. రోడ్లు, రివర్ ఫ్రంట్స్, స్కూల్స్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ, టెంపుల్స్ టూరిస్ట్ హబ్.. మొదలైన పనులను వర్చువల్ గా ప్రారంభించారు. వారణాసి- బందోహి, చితౌని -తారకేశ్వర్ రోడ్ల కనెక్టివిటీని ప్రారంభించారు ప్రధాని మోదీ. అదే విధంగా హర్దత్ పూర్ లో కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. 

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు ప్రధాని. మొత్తం 880 కోట్ల విలువైన ఎలక్ట్రికల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కు శంకుస్థాపన చేశారు మోదీ. అదే విధంగా 8 రివర్ ఫ్రంట్స్ అభివృద్ధికి సంబంధించిన పనులను ప్రారంభించారు. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ స్కీమ్ కింద 47 రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోదీ. 

వర్చువల్ గా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి:

మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమానికి వర్చువల్ గా హాజరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ని రైతు వేదికలోనిధుల కేటాయింపు కార్యక్రమానికి ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు.

►ALSO READ | ట్రంప్ మాటలన్నీ ఉత్తవే.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదు: భారత ప్రభుత్వ వర్గాలు