మెటా AI వార్: 24 ఏళ్ల కుర్రోడికి రూ.2వేల కోట్ల శాలరీ ఆఫర్.. ఎవరీ మ్యాట్ డీట్కే?

మెటా AI వార్: 24 ఏళ్ల కుర్రోడికి రూ.2వేల కోట్ల శాలరీ ఆఫర్.. ఎవరీ మ్యాట్ డీట్కే?

Matt Deitke: ఏఐ రేసులో ముందుకు దూసుకుపోయేందుకు అమెరికాలోని టెక్ దిగ్గజాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ యుద్ధంలో సంస్థలు ఏఐ టాలెంట్ కోసం వేల కోట్లు శాలరీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. మరోపక్క కంపెనీల్లో కీలక టెక్కీలను ఆకట్టుకునేందుకు మెగ్ శాలరీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 

ఈ క్రమంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా రేసులో హీటును రోజురోజుకూ పెంచేస్తోంది. నేరుగా మార్క్ జూకర్‌బర్గ్ రిక్రూట్మెంట్లను పర్యవేక్షించటం.. వారి రిజెక్ట్ చేయలేని ప్యాకేజీలను ఆఫర్ చేస్తుండటం అందరూ నివ్వెరపోయేలా చేస్తోంది. ఈక్రమంలోనే మెటా 24 ఏళ్ల మ్యాట్ డీట్కే అనే ఏఐ రీసెర్చర్ నియామకానికి 250 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆఫర్ చేయటం గమనార్హం. భారత కరెన్సీ లెక్కల ప్రకారం ఈ ప్యాకేజీ రూ.2వేల 180 కోట్లకు సమానమైనదిగా వెల్లడైంది. 

ALSO READ : UPI చెల్లింపులపై ఛార్జీలు ప్రకటించిన ఐసిఐసిఐ బ్యాంక్.. యూజర్లపై ప్రభావం ఇదే..!

దీంతో ఇప్పుడు నెట్టింట అసలు ఎవరు ఈ మ్యాట్ డీట్కే అనే సెర్చ్ ఊపందుకుంది. ఎందుకు మెటా అతనికి అంత పెద్ద ప్యాకేజీ ఆఫర్ చేయాల్సి వచ్చిందనే చర్చ కొనసాగుతోంది. మ్యాట్ డీట్కే ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పీహెచ్ డీ నుంచి బయటకు వచ్చారు. మెుదటగా అతనికి మెటా 125 మిలియన్ డాలర్ల ప్యాకేజీతో నాలుగేళ్ల కాలానికి ఉద్యోగం ఆఫర్ చేసింది. మ్యాట్ దానిని రిజెక్ట్ చేయటంతో.. జూకర్ బర్గ్ అతడిని వ్యక్తిగతంగా కలిశారు. దీంతో ఆఫర్ అమాంతం డబుల్ చేయబడింది. 

కళాశాల విద్యను వదిలేసిన తర్వాత డీట్కే సియాటిల్ నగరంలోని అలెన్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలో పనిచేశాడు. అక్కడ మోల్మో అనే చాట్ బాట్ క్రియేట్ చేశాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఆడియో, ఇమేజెస్ ద్వారా కూడా సమాధానం ఇవ్వటమే. ఆ తర్వాత 2023లో డీట్కే వెర్సెప్ట్ అనే స్టార్టప్ సహ వ్యవస్థాపకుడిగా మారాడు. కేవలం 10 మందితో స్టార్ట్ అయిన కంపెనీ గూగుల్ సీఈవో ఎరిక్ నుంచి 16.5 మిలియన్ డాలర్ల ఫండింగ్ కూడా పొందింది. ఏఐ ఏజెంట్ల నావిగేషన్, ఆన్ లైన్ టాస్క్ ఎగ్జిక్యూషన్ పై సంస్థ పనిచేస్తోంది.