కాలికి మట్టి అంటకుండా.. ఒంటికి చెమట చుక్క రాకుండా.. లగ్జరీగా బతికేవాళ్లు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. అందులో కొందరు చట్టబద్ధమైన వ్యాపారం, ఉద్యోగాలు చేస్తుండగా.. మరికొందరు తమ లగ్జరీల కోసం పేదల మానప్రాణాలను పణంగా పెట్టి సముపార్జిస్తున్నారు. అలాంటి వారే ఈ కిలాడీ సిస్టర్స్. ఆకలి, పేదరికాన్నే ఆసరగా చేసుకుని ఉద్యోగం, డబ్బులను ఎరగా చూపి.. అమాయక యువతులను రొంపిలోకి దింపిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల బాగోతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ భోపాల్ లో బయటపడిన సెక్స్ రాకెట్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చత్తీస్ ఘడ్ కు చెందిన 21 ఏళ్ల యువతి, అదే విధంగా భోపాల్ కు చెందిన 30 ఏళ్ల యువతి.. ఇద్దరు పోలీసును ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వేర్వేరుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ.. ఇద్దరి కథలు ఒకటే కావడం గమనార్హం. ఉద్యోగ హామీతో డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేసి.. వ్యభిచార రొంపిలోకి దింపారట అఫ్రీన్, అమ్రీన్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు.
ఇందులో కామన్ స్టోరీ ఏంటంటే.. ఆర్థికంగా వెనకబడిన యువతులను టార్గెట్ చేసి దందా నడుపుతున్నారు ఈ కిలాడీలు. ముందుగా జాబ్ ఆఫర్ చూపించి.. అందుకు సంబంధించిన ప్రాసెస్ చేస్తున్నట్లుగా నటించి.. నమ్మకం కుదిరాక వాళ్లను నీచ వృత్తిలోకి దించుతున్నారట. 2025 నవంబర్ నుంచి కొన్నాళ్లపాటు అమ్రీన్ తో రూమ్ షేర్ చేసుకున్న 21 ఏళ్ల బ్యూటీషియన్ ఈ బాగోతానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భోపాల్ లోని అబ్బాస్ నగర్ లో ఉన్న బంధువుల దగ్గరికి నవంబర్ లో అమ్రీన్ తనను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు.
షాకింగ్ నిజాలు:
ఈ సెక్స్ రాకెట్ గురించి భాయనకమైన నిజాలు వెల్లడించింది బాధితురాలు. అమ్రీన్ సోదరుడు బిలాల్.. టీ లో మత్తు పదార్థాలు కలిపి.. స్పృహలో లేనప్పుడు తనను రేప్ చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాతి నెలలో పర్సనల్ వర్క్ పేరున అమ్రీన్ తనను అహ్మదాబాద్ తీసుకెళ్లి.. యాసిర్ అనే వ్యక్తిని పరిచయం చేసినట్లు చెప్పింది. యాసిర్ కూడా ఆమెను రేప్ చేసినట్లు పేర్కొంది. ఇదే కాకుండా అమ్రీన్ ఫ్రెండ్ అయిన చందన్ యాదవ్.. 2025 ఆగస్టు నుంచి 2026 జనవరి మధ్యలో అనేక సార్లు రేప్ చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించింది.
ఇలా బ్లాక్ మెయిల్ చేశారు..:
తనకు తెలియకుండా తననెలా వ్యభిచార కూపంలోకి దింపారో బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సెక్సువల్ గా తను ప్రతిఘటిస్తే.. ఫోటోలు వీడియోలు బయటపెడతామని బెదిరించినట్లు చెప్పింది. మత్తు మందుతో స్పృహ కోల్పోయేలా చేసి తీసిన ఫోటోలతో ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు పేర్కొంది. అయితే ఈ దారుణం అక్కడితో ఆగలేదని.. తరువాతి కొన్ని వారాల పాటు జరిగిందని వాపోయింది. తనను బలవంతంగా పొట్టి దుస్తులు ధరించేలా చేసి.. పబ్‌లకు తీసుకెళ్లి కోటీశ్వరులతో కలిపేవారని ఆమె పేర్కొంది.
►ALSO READ | రెండు నెలల కొడుకు ఏడుపును కూడా భరించలేని కసాయి తల్లి.. నోట్లో గుడ్డలు కుక్కి పొయ్యిలో పడేసింది !
బ్యూటీషియన్ తనను బలవంతంగా డ్రగ్స్ తాగించారని పేర్కొంది. అనేక సందర్భాల్లో లైంగిక దాడి జరిగినట్లు తెలిపింది. అయితే, చివరికి 2026 జనవరిలో పారిపోయిన బాధితురాలు ఛత్తీస్‌గఢ్ లో ఉన్న తన మామ దగ్గర కొన్నాళ్లు తలదాచుకుంది. చివరికి ఆమె ఫిబ్రవరిలో భోపాల్‌కు తిరిగి వచ్చి ఫిబ్రవరి 22న బాగ్సేవానియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
రెండవ బాధితురాలి మాటల్లో:
అమ్రీన్ ఇంట్లో పనిచేసే మరో మహిళ కూడా వారం ఇలాంటి ఫిర్యాదునే చేసింది. మొదటి మహిళ కేసులో ఎవరున్నారో.. రెండవ మహిళ కూడా వారిని ఫిర్యాదులో పేర్కొంది. - యాసిర్, బిలాల్, చందన్ - తనను డ్రగ్స్ ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించింది. అతే కాకుండా పోలీసులకు వీడియో ఎవిడెన్స్ కూడా అందించింది.
బాధితురాలి నుంచి ఆధారాలతో కూడిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. అత్యాచారం చేసిన ముగ్గురు పురుషులతో పాటు ఈ బాగోతానికి కారణమైన మాస్టర్ మైండ్స్, ఇద్దరు చెల్లెళ్లపై అత్యాచారం, నేరపూరిత కుట్ర, బలవంతపు మత మార్పిడికి సంబంధించిన విభాగాల కింద కేసులు నమోదు చేశారు.
పాపపు సొమ్ముతో విలాసాలు:
పేద యువతులను రొంపిలోకి దింపి సంపాదించిన డబ్బుతో ఈ గ్యాంగ్ విలాసాలకు అలవాటు పడింది. భోపాల్‌లోని హోషంగాబాద్‌లోని ఉన్నత స్థాయి సాగర్ రాయల్ విల్లాస్ కాలనీలోని విలాసవంతమైన ఫ్లాట్‌లో ఈ కిలాడీ సోదరీమణులు నివసిస్తున్నారు. పాపపు సొమ్ముతో విల్లాలు, కార్లు, షికార్లు అంటూ ఎంజాయ్ చేశారు. వీళ్ల కదలికలు గతంలో కూడా అనుమానాన్ని రేకెత్తించాయని ఇరుగు పొరుగు వారు తెలిపారు. ఆడ మగ గ్యాంగ్ తరచుగా రాత్రిపూట తమ ఫ్లాట్‌కు వచ్చేవారని అపార్ట్ మెంట్ లో ఉన్న వారు చెప్పారు. బురఖా ధరించిన మహిళలు తరచుగా ఫ్లాట్ కు వస్తుండగా.. అఫ్రీన్, అమ్రీన్ జీన్స్ మాత్రమే ధరించారని చూసిన వారు చెబుతున్నారు.
అయితే ఈ సెక్స్ రాకెట్ స్థానిక హిందూ సంస్థల నిరసనలకు దారితీసింది. భోపాల్‌లో మహిళలు , యువతులు ఇలాంటి ట్రాప్ లో పడకుండా అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలను నిర్వహిస్తామని హిందూ ఉత్సవ్ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారీ అన్నారు. మహిళా బ్రిగేడ్‌లను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఈ సమస్య మత పరమైన వివాదానికి దారితీయకుండా ఉండేందుకు అందరూ సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
