
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ భర్త ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సూరత్ లో చోటు చేసుకుంది. సూరత్ లోని దిండోలీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సూరత్ లోని దిండోలీలో ఓ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు అల్పేష్ భాయ్, అతని భార్య ఫల్గుణి భాయ్ జిల్లా పంచాయితీ ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అల్పేష్ భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకున్న అల్పేష్ భాయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తన వదిన ఫల్గుణి భాయ్, నరేష్ కుమార్ రాథోడ్ అనే మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉందని.. అందువల్లే అల్పేష్ భాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అల్పేష్ సోదరుడు ఆరోపిస్తున్నారు.అల్పేష్ మొబైల్‌లో సూసైడ్ నోట్ రెండు డైరీలు, కొన్ని వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అల్పేష్ సూసైడ్ నోట్, డైరీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.భార్య వివాహేతర సంబంధం కారణంగా తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు అల్పేష్ సూసైడ్ నోట్ లో రాసుకున్నాడని తెలిపారు పోలీసులు. డైరీలో కూడా ఈ వ్యవహారం గురించి ఉన్నట్లు తెలిపారు పోలీసులు. వివాహేతర సంబంధం విషయంలో అల్పేష్ తన భార్యతో తరచూ గొడవపడేవాడని తెలిపారు బంధువులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్పేష్ భార్య ఫల్గుణి భాయ్, ఆమె లవర్ ను అదుపులోకి తీసుకున్నారు.