ఇప్పటికే రికార్డ్ రేట్లను తాకిన బంగారం రేట్లు అలుపు లేకుండా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. క్రిస్టమస్ పండుగ ముందు రోజు కూడా విలువైన లోహాలు భారీగా పెరిగాయి. ప్రధానంగా గోల్డ్ రేట్ల ర్యాలీకి అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతోపాటు పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్ల నుంచి కొనసాగుతున్న నిరంతర డిమాండ్ రేట్లను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు వెండి కూడా పారిశ్రామిక అవసరాలు పెరగటంతో చరిత్రలో చూడని, వినని స్థాయిలకు పెరుగుతూ పోతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 24, 2025న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో డిసెంబర్ 23 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.38 పెరిగింది. తాజా పెంపు తర్వాత హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 893గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ గ్రాముకు రూ.12వేల 735గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : 2025లో రూ.1.76 లక్షల కోట్ల ఐపీవోలు..
ఇక వెండి కూడా డిసెంబర్ నెలలో భారీ ర్యాలీని కొనసాగించింది. ముఖ్యంగా డిజిటల్, ఫిజికల్ డిమాండ్ పెరుగుతుండటం.. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవటంతో సిల్వర్ రేట్ల ర్యాలీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. దీంతో డిసెంబర్ 24, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేల భారీ పెంపును నమోదు చేసింది. ఈ పెరుగుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 44వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.244 వద్ద కొనసాగుతోంది.
