దేశంలో ఆహార కల్తీ, కల్తీ సరుకులు, ఎనర్జీ డ్రింక్స్ పై భాతర ఆహార నియంత్రణ సంస్థ (FSSAI) సీరియస్ అయ్యింది. కల్తీనే కాదు.. ముఖ్యంగా ఉత్తేజం, ఉల్లాసం అంటూ యువత ఆరోగ్యాన్ని చెడగొడుతున్న ఎనర్జీ డ్రింక్స్ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే దేశంలో బాగా అమ్ముడుపోతున్న, పాపులర్ అయిన ఐదు ఎనర్జీ డ్రింగ్స్ తయారీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది.
నోటీసులు అందుకున్న వాటిలో రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్, పెప్సీకి చెందిన అడ్రినలిన్ రష్ ఎనర్జీ డ్రింక్, రిలయన్స్ క్యాంపా ఎనర్జీ డ్రింక్, గోల్డ్ బూస్ట్, స్టింగ్ ఎనర్జీ, హెల్ ఎనర్జీ, కోకాకోలాకు చెందిన మాన్ స్టర్ ఎనర్జీ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది.
ఎనర్జీ డ్రింక్స్ పేరుతో తప్పుడు బ్రాండింగ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తూనే.. దేశంలో ఎనర్జీ డ్రింక్స్ లేదా అలాంటి ఉత్పత్తులకు ఎలాంటి అనుమతులు లేవని.. ఎలాంటి ప్రమాణాలు భారత ఆహార నియంత్రణ సంస్థ రూపొందించలేదని స్పష్టం చేసింది. FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఎనర్జీ డ్రింక్స్ పేరుతో బ్రాండింగ్ చేయటాన్ని తప్పుబట్టింది. దేశంలో ఎనర్జీ డ్రింక్స్ ఎలాంటి అనుమతులు లేకపోయినా.. ఎనర్జీ డ్రింక్ పేరు పేరుతో ఆయా డ్రింక్స్ పై లేబుల్ ఎలా ముద్రిస్తారని ప్రశ్నించింది భారత ఆహార నియంత్రణ సంస్థ.
►ALSO READ | కోలా మార్కెట్లోకి ఐటీసీ ఎంట్రీ.. రిలయన్స్‌తో కొత్త ప్లాన్.. సరికొత్త ‘కొబ్బరి నీళ్ల డ్రింక్’!
శరీరానికి శక్తి.. మనస్సుకు ఉత్తేజం, ఏకాగ్రతను పెంచుతుంది.. శక్తిని పెంచుతుంది.. ఉత్సాహం, ఉల్లాసాన్ని ఇస్తుంది అంటూ ఆయా ఎనర్జీ డ్రింక్స్ ప్రచారం చేసుకుంటున్నాయని.. ఇది యువతను తప్పుదోవ పట్టించటమే అని.. భారత ఆహార నియంత్రణ సంస్థ అధికారికంగా ఎలాంటి ఎనర్జీ డ్రింక్స్ కు అనుమతి ఇవ్వకపోయినా.. ఇలాంటి ప్రచారం ఎలా చేస్తున్నారని ఆయా కంపెనీలకు నోటీసులు ఇచ్చింది FSSAI.
ఎనర్జీ డ్రింక్స్ విషయంలో కస్టమర్ల నుంచి చాలా కంప్లయింట్స్ వస్తున్నాయని.. వాటి ఆధారంగానే ఈ నోటీసులు అందిస్తున్నట్లు వెల్లడించింది FSSAI. ఎనర్జీ డ్రింక్స్ తయారీ కంపెనీదారులు.. తప్పుడు బ్రాండింగ్ చేయటాన్ని ఖండిస్తూ.. వెంటనే వివరణ ఇవ్వాలని ఆయా నోటీసుల్లో స్పష్టం చేసింది. నోటీసులకు స్పందించకుండా ఎనర్జీ డ్రింక్స్ పేరుతో అమ్మకాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది భారత ఆహార నియంత్రణ సంస్థ FSSAI.
