తెలంగాణ సెక్రటేరియట్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎంట్రీ రూల్స్ అమలు చేస్తోంది. గతంలో ఉన్న విధానానికి భిన్నంగా, ఇకపై సచివాలయంలోకి ప్రవేశించే అన్ని వాహనాలకు క్యూఆర్ కోడ్ విధానం తప్పనిసరి చేసింది. వాహనం గేటు వద్దకు చేరుకున్నప్పుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన వెంటనే వాహన నంబర్, ఓనర్ పేరు, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు అవుతాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా ఏ వాహనానికీ సచివాలయంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని సెక్రటేరియట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) అధికారులు చెబుతున్నారు.
నకిలీ ఉద్యోగులు, అనుమతి లేని వ్యక్తులు, మోసాలకు అడ్డుకట్ట వేయడమే ఈ కొత్త రూల్స్ ప్రధానఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ సచివాలయంలోకి వచ్చే వాహనాల వివరాలు పూర్తిగా నమోదు కావడంతో భద్రత మరింత మెరుగుపడుతుందని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రభుత్వ ఆఫీసుల్లో పారదర్శకత, భద్రత పెంచే దిశగా ఇది ఒక కీలక ముందడుగుగా అధికారులు చెబుతున్నారు.
►ALSO READ | బీఆర్ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే...ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
