కేంద్ర హోంశాఖపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. సీజేపీ కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తల ఫోన్ కాల్స్, వాట్సాప్ మేసేజ్ లను వర్డ్ టుం వర్డ్ వింటున్నారు.. చదువుతున్నారని అన్నారు. ఎగ్జామ్ పేపర్ లీక్ లతో విద్యార్థులకు జరుగుతున్న తీవ్ర అన్యాయం జరుగుతోంది. పేపర్ లీకులకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేయాలని తాము నిరాహార దీక్ష చేపట్టాం.. మా డిమాండ్లను పరిష్కరించకుండా మా ఫోన్లను ట్యాపింగ్ చేయడం దారుణమన్నారు.
మా ఫోన్లు నిఘాలో ఉన్నాయి..మా వాట్సాప్ కాల్స్, చాట్ లను మొత్తం చూస్తున్నారు.. వింటున్నారు. మా ఇంటర్నల్ టీంతో మేం మాట్లాడిన ప్రతి మాట, ప్రతీ వాట్సాప్ చాట్ లీకు అవుతుందని సీజేపీ కార్యకర్తల ఫోన్ ట్యాపింగ్ జరుగులతుందని సోషల్ మీడియా ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే మేసేజ్ షేర్ చేశారు.
మరోవైపు నిరసన దీక్షలో పాల్గొన్న యువతపై పోలీసుల దాడిని అభిజిత్ దీప్కే ఖండించారు. దీక్ష ప్రాంగణంలో లైబ్రరీ ఏర్పాటు చేసినందుకు విద్యార్తులపై పోలీసులు దాడులు చేశారు. పుస్తకాలను వీధుల్లోవిసిరేసి విద్యార్తులను కొట్టారని ఆరోపించారు. వెంటనే ఢిల్లీ ఏసీపీ అజయ్ శర్మను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అభిజిత్ దీప్కే.
ACP Ajay Sharma and his team threw away the books, which included books on Chhatrapati Shivaji Maharaj and Bhagat Singh and assaulted students for setting up library.
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 2, 2026
We demand the immediate suspension of ACP Ajay Sharma for insulting Chhatrapati Shivaji Maharaj and Bhagat… pic.twitter.com/axzpjqlzOt
ALSO READ : ఇది కనిపించని విపత్తు.. లీగల్ ప్రక్రియలో AI వాడకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఎగ్జామ్ పేపర్ లీక్ కు బాధ్యత వహించిన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులకు మద్దతుగా పర్యావరణ వేత్త వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష 13వ రోజుకు చేరుకుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు దీక్షలో ఉన్నారు. వేలాది మంది యువత ఈ నిరాహార దీక్షకుమద్దుతుగా ఢిల్లీలో ఉన్నారు.
Sources within the system have informed us that our phones are under surveillance and that our WhatsApp calls and chats are being monitored.
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 1, 2026
The sources told us the exact conversations word to word we had in the internal team.
