కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్.. ధ్రువ్ విక్రమ్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్ లాంచ్!

కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్.. ధ్రువ్ విక్రమ్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్ లాంచ్!

టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ మార్కెట్ పై కూడా దృష్టి పెట్టింది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. వరుస క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తూ దూసుకెళ్తోంది. లేటెస్ట్ గా తమిళంలో తమ నాల్గవ ప్రాజెక్టును (#MythriTamil04) అఫీషియల్ గా లాంచ్ చేసింది. కంటెంట్ ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటూ.. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

ధ్రువ్ విక్రమ్ హీరోగా..

ఇటీవలే 'బైసన్'సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన చియాన్ విక్రమ్ వారసుడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో ధ్రువ్ విక్రమ్ ఈ చిత్రంలో కథానాయకుడు. ధ్రువ్ కెరీర్‌లో 4వ సినిమాగా (#DV4) రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్.. చెన్నైలోని MRC నగర్‌లో ఉన్న మైత్రీ కార్యాలయంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

ఊరమాస్ అవతార్ లో...

ఇప్పటివరకు క్లాస్, లవ్, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసిన ధ్రువ్.. ఈ సినిమాతో మొదటిసారి ఒక అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నారు. మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ ఈ కథను సిద్ధం చేశారు. కరణ్, రైటర్ శబీ సంయుక్తంగా పవర్‌ఫుల్ డైలాగ్స్, హై-వోల్టేజ్ స్క్రీన్‌ప్లేను లాక్ చేశారు.

కోలీవుడ్ డైరెక్టర్స్..

ఈ లాంచ్ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అధిక్ రవిచంద్రన్, రవికుమార్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజాతో పాటు టాలీవుడ్ నుంచి 'హాయ్ నాన్న' ఫేమ్ శౌర్యువ్ విచ్చేసి చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. దర్శకుడు కీర్తిశ్వరన్ ముహూర్తపు షాట్‌కు క్లాప్‌బోర్డ్ కొట్టారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 

ALSO READ : VARANASI: బ్లాక్ ఫారెస్ట్‌లో భారీ యాక్షన్‌కు రంగం సిద్ధం.. మహేష్‌తో జక్కన్న కొత్త స్కెచ్!

సినిమాలో విలనిజం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. కీలక పాత్రల కోసం వర్సటైల్ యాక్టర్ పృథ్విరాజ్, విలక్షణ నటుడు సాయి దీనలను ఎంపిక చేశారు. విక్కీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా,' చియాన్' ఎడిటర్‌గా, వి.ఎమ్. మోర్ స్టంట్ మాస్టర్‌గా హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేయబోతున్నారు. హీరోయిన్ , టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం మెగా అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.