ఇది కనిపించని విపత్తు.. లీగల్ ప్రక్రియలో AI వాడకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

ఇది కనిపించని విపత్తు.. లీగల్ ప్రక్రియలో AI వాడకంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

 లీగల్ ప్రక్రియలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)  వాడకం కనిపించని వినాశనకర చర్య అని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. AI ఉపయోగించి సృష్టించిన నకిలీ, ఊహాత్మక  కేసుల సైటేషన్లపై ఆధారపడిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) తీర్పును సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించాలని సూచించింది.

 గురువారం (జులై 02) వెల్లడించిన తీర్పులో AI ద్వారా వచ్చిన నకిలీ కేసులను ఉపయోగించడం లాయర్లకు  మిస్‌కండక్ట్ అవుతుందని పేర్కొంది. అలాంటి నకిలీ మెటీరియల్‌పై ఆధారపడి వచ్చిన ఏ తీర్పునైనా చట్టపరంగా తీర్పు కాదని , అలాంటి తీర్పులను రద్దు చేయాలని స్పష్టం చేసింది. 

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన బెంచ్ ఎసెల్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ ఇన్సాల్వెన్సీ కేసులో NCLT తీర్పును సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జరగని ఫేక్ అంశాలు, ఊహాత్మక కేసుల సైటేషన్లను ఏఐ ఉపయోగించడం వల్ల ఈ సమస్య తలెత్తిందని పేర్కొంది. 

లీగల్ ప్రక్రియలో ఏఐ వినియోగం.. ఎంత ప్రమాదకరమో  సుప్రీం కోర్టు ఎత్తి చూపింది. న్యాయవ్యవస్థలో నిర్ణయాల సమగ్రతను కాపాడటం అత్యంత ముఖ్యమని, నకిలీ లేదా హాల్యూసినేటెడ్ మెటీరియల్ కేవలం ఒక్క అంశం కూడా తీర్పులో ఎంటర్ అయినా ఆ తీర్పును రద్దు చేయాలని ఆదేశించింది. ఇది న్యాయపరమైన ప్రక్రియ పవిత్రతను ఉల్లంఘించడమేనని, రూల్ ఆఫ్ లా ను భంగపరచడమేనని వ్యాఖ్యానించింది. 

►ALSO READ | బెంగళూరు డేకేర్ దారుణం: పసిపిల్లల వేధింపులను బయటపెట్టినందుకు ఉద్యోగిని తొలగింపు !

అయితే, AI టెక్నాలజీని  సరైన, న్యాయ నిబంధనలకు అనుకూలంగా వాడిన కేసులపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం ఫేక్ లేదా హాల్యూజినేటెడ్ (భ్రమతో కూడిన)  మెటీరియల్‌ను కోర్టు తీర్పులుగా ప్రదర్శించడం, ఆధారపడటం పైనే ఈ తీర్పు అప్లికేబుల్ అవుతుందని తెలిపింది.  

NCLAT (అప్పీలేట్ ట్రిబ్యునల్) కూడా ఈ నకిలీ కేసులను గుర్తించలేకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  లాయర్లు చెప్పే సైటేషన్లపై కోర్టులు అనుమానించాల్సి రావడం, ప్రతి సైటేషన్ నిజమా కాదా అని వెరిఫై చేయడం ఎంత కష్టమో కోర్టు హైలైట్ చేసింది. బార్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని ఆదేశించింది. ఈ తీర్పు లీగల్ ఫ్రటర్నిటీలో చర్చనీయాంశమైంది. AI సాంకేతికత ఎంతో ఉపయోగకరమైనా, దానిని జాగ్రత్తగా, ధృవీకరించి మాత్రమే ఉపయోగించాలని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.