OMG : ఫోన్ మాట్లాడుతూ మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయిన వ్యక్తి

OMG : ఫోన్ మాట్లాడుతూ మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయిన వ్యక్తి

వర్షాలు పడుతున్నాయి.. రోడ్లు అన్నీ నీళ్లే.. ఎక్కడ గుంత ఉంది.. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది అనేది కష్టం అయిపోయింది. ఈ క్రమంలోనే పని కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన 60 ఏళ్ల వ్యక్తి.. నడి రోడ్డుపై తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయాడు. భారీ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అతను దొరికాడు.. కాకపోతే ప్రాణాలతో కాదు.. ముంబై సిటీలో జరిగిన ఈ ఘటనపై జనం నుంచి తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

అది ముంబై సిటీ. సాకినాకా ఏరియా.  2026, జూలై 2వ తేదీ గురువారం ఉదయం ముంబై సిటీలో కుండపోత వర్షం పడింది. రోడ్లపై నీళ్లు నిలిచాయి. రోడ్లపై నిలిచిన నీటిని పంపించేందుకు ముంబై కార్పొరేషన్ సిబ్బంది రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ మూత ఓపెన్ చేసింది.

ఇదే సమయంలో 60 ఏళ్ల వయస్సు ఉన్న ఇసాక్ షేక్ అనే వ్యక్తి పనిపై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సాకినాకా ఏరియాలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు. నీళ్ల కింద ఉన్న మ్యాన్ హోల్ మూత తీసి ఉందా.. మూసి ఉందో తెలియక నడుస్తూనే ఉన్నాడు. 

సరిగ్గా ఈ సమయంలోనే తెరిచి ఉన్న మ్యాన్ హోల్ పై పడ్డాడు. అతని చేతిలో ఉన్న ఫోన్, గొడుకు రోడ్డుపై పడ్డాయి. అప్పటికే డ్రైనీళ్లు వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. మ్యాన్ హోల్ పై పడిన వెంటనే.. ఇసాన్ షేక్ కొట్టుకుపోయాడు. చుట్టుపక్కల షాపుల వాళ్లు, రోడ్డుపై నడుస్తున్న వాళ్లు అతన్ని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ముంబై కార్పొరేషన్ సిబ్బంది, పోలీసులతోపాటు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. 

►ALSO READ | బెంగళూరు డేకేర్ దారుణం: పసిపిల్లల వేధింపులను బయటపెట్టినందుకు ఉద్యోగిని తొలగింపు !

డ్రైనేజీ లింక్ అంతా వెతుక్కుంటూ వెళ్లగా.. అర కిలోమీటర్ దూరంలో.. డ్రైనేజీలో శవంగా కనిపించాడు ఇసాక్ షేక్. ఈ ఘటనపై ముంబై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాన్ హోల్ మూతలు ఓపెన్ చేసినప్పుడు దాని చుట్టూ రక్షణ తాడులు పెట్టటం, బారికేడ్లు పెట్టటం లేదని.. దీని వల్లే ప్రమాదం జరిగిందని.. రోడ్డుపై నీళ్లు నిలిచినప్పుడు మ్యాన్ హోల్ మూత తెరిచి ఉన్న సంగతి ఎలా తెలుస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ముంబై కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో దుస్థితి తలచుకుంటే భయమేస్తుందంటూ ముంబై సిటీ జనం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.