Lionel Messi: కేప్ వర్డేతో జరగబోయే ఫిఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్‌కు ముందు అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి అతను ఫుట్‌బాల్ ఆటతో కాకుండా మైదానం వెలుపల చేసిన ఒక సరదా సన్నీవేశంతో వార్తల్లో నిలిచాడు. అర్జెంటీనా జట్టు మయామి చేరుకున్న సమయంలో విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో మెస్సీ ఇచ్చిన లైట్-హార్టెడ్ రియాక్షన్‌ని చూసి ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
నవ్వు ఆపుకోలేకపోయిన మెస్సీ:
అర్జెంటీనా జట్టు మయామిలో అడుగు పెట్టగానే రూల్స్ ప్రకారం భద్రతా సిబ్బంది ఆటగాళ్లందరికీ రొటీన్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక సెక్యూరిటీ అధికారి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్‌తో మెస్సీని తనిఖీ చేస్తూ, స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం అతనిని కాసేపు ఫ్రిస్కింగ్ చేశాడు. ఆ సమయంలో సదరు అధికారి చేసిన తనిఖీకి మెస్సీ ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేక పెద్దగా నవ్వేశాడు. ఈ చిన్న ఫన్నీ మూమెంట్ కెమెరాల్లో రికార్డ్ కావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
►ALSO READ | సీఎస్‌కేలోకి హార్దిక్ పాండ్యా?.. చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ రిప్లై వైరల్
మెస్సీ తీరుపై ప్రశంసల జల్లు:
కేవలం కొన్ని సెకన్ల పాటు కొనసాగిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడంతో అభిమానులు మెస్సీని అభినందిస్తున్నారు. అంతర్జాతీయ స్టార్ సెలబ్రిటీ అయినప్పటికీ ఎలాంటి ప్రత్యేక మర్యాదలు ఆశించకుండా, సాధారణ పౌరుడిలా సెక్యూరిటీ చెకింగ్‌కు సహకరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడైన (GOAT) మెస్సీకి కూడా సెక్యూరిటీ చెక్కుల నుంచి మినహాయింపు లేదని జోకులు వేస్తున్నారు. ఇక మెస్సీ ఇప్పుడు కేప్ వర్డేతో జరగబోయే అత్యంత కీలకమైన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌పై పూర్తి దృష్టి సారించాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న అర్జెంటీనాను రౌండ్ ఆఫ్ 16కు చేర్చడంలో కెప్టెన్ మెస్సీ కీలక పాత్ర పోషిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Messi passou pelo detector de metais durante a chegada da delegação da Argentina em Miami.
— LM10 Brasil (@MessiLeoBrasil_) July 2, 2026
A carinha dele rindo KKKKKKKKKKKKKKKKKKK pic.twitter.com/HHKVJChwPk
