రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు ఇస్తాం.. ఖమ్మం జిల్లాలో భారీ డెకాయిటీ కేసు.. నిందితుల్లో ఇద్దరు కానిస్టేబుల్స్

రూ.10 లక్షలు ఇస్తే రూ.40 లక్షలు ఇస్తాం.. ఖమ్మం జిల్లాలో భారీ డెకాయిటీ కేసు.. నిందితుల్లో ఇద్దరు కానిస్టేబుల్స్

ఖమ్మం జిల్లాలో భారీ డెకాయిట్ కేసును ఛేదించారు పోలీసులు. పది లక్షలకు 40 లక్షల రూపాయలు ఇస్తామని అమాయకులను బురిడీ చేసిన నిందితులను పట్టుకున్నారు. గురువారం (జులై 02) పట్టుబడిన నిందితుల్లో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండటం పోలీసులను షాకింగ్ కు గురిచేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగారం డెకాయిటీ కేసును  కల్లూరు ఏసీపీ వసుంధర్ యాదవ్ ఆధ్వర్యంలో సత్తుపల్లి పోలీస్ ప్రత్యేక బృందాలు ఛేదించారు. ఈ ఘటనలో 12 మంది నిందితుల అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు  నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

అరెస్టైన వారిలో TGSP కానిస్టేబుల్ ముళ్ళగిరి వర్ధన్, TGSP రుశీ బేరా కేశవరావు ఉండటం సంచలనంగా మారింది. బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామని నమ్మించి అమాయకులను వలలో వేసింది ఈ ముఠా. రూ.10 లక్షలు ఇస్తే 40 లక్షలు రూపాయాలు ఇస్తాం అంటూ బాధితులను బురిడీ కొట్టించి మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

నకిలీ పోలీసులతో ప్లాన్:

అమాయకులను బురిడీ కొట్టించేందుకు భలే ప్లాన్ వేశారు నిందితులు. బాధితులను పిలిపించి నకిలీ పోలీసుల దాడితో నగదు దోచుకునే పథకానికి తెరతీశారు. పోలీస్ యూనిఫాంలు ధరించి డెకాయిటీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

►ALSO READ | పని ఇప్పిస్తానని మహిళను తీసుకెళ్లి... బంగారం లాక్కొని బావిలో తోసేశాడు... 24 గంటలు బావిలోనే...

నిందితుల నుంచి17 లక్షల 60 వేల నగదు, 2 ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, ఒక టీవీఎస్ యాక్సెస్ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా 16 సెల్‌ఫోన్లు, పోలీస్ యూనిఫాంలు, హ్యాండ్‌కఫ్, 80 బండిళ్లు డమ్మీ 500 రూపాయాల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

అరెస్టైన 12 మంది నిందితులను రిమాండ్ కు పంపించారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈ సందర్భంగా కల్లూరు ఏసీపి వసుంధర యాదవ్ వెల్లడించారు.