Free Pizza In FIFA World Cup 2026: డొమినోస్ పిజ్జా అంటే ఈ ప్రపంచంలో తెలియనివారంటూ ఎవరూ లేరు.. వరల్డ్ వైడ్ గా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ సంస్థ, తాజాగా ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్‌తో వార్తల్లో నిలిచింది. ఏకంగా ఒక మిలియన్ డాలర్ల (సుమారు 8.3 కోట్ల రూపాయలు) విలువైన పిజ్జాలను ఫ్రీగా పంపిణీ చేయబోతుంది. ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జరిగిన చిన్న సంఘటనతో ఇంత పెద్ద ఎత్తున ఉచితంగా పిజ్జాలని ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు V6 తెలుగు వైబ్ సైట్లో చూద్దాం..
అమెరికా ప్లేయర్‌కు రెడ్ కార్డ్.. డొమినోస్‌కు బిగ్ షాక్:
ప్రస్తుతం ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup 2026) నాకౌట్ మ్యాచ్‌లు జోరుగా కొనసాగుతున్నాయి. రౌండ్ 32 పోటీల్లో భాగంగా ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా (USA), నాకౌట్ మ్యాచ్‌లో బోస్నియాతో పోటీపడింది. ఈ హోరాహోరీ పోరులో అమెరికా 2–0 తేడాతో గెలిచి రౌండ్ ఆఫ్ 16కు చేరింది. కానీ, ఈ మ్యాచ్‌లోనే ఒక క్రేజీ ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఒక మిలియన్ డాలర్ల పిజ్జాలని ఫ్రీగా పంపిణీ:
మ్యాచ్ ప్రారంభంలో అద్భుతమైన గోల్ చేసి అమెరికాకు లీడ్ అందించిన యూఎస్ స్ట్రైకర్ ఫోలారిన్ బలోగన్, ఆట 64వ నిమిషంలో ఒక ఫౌల్ కారణంగా రెడ్ కార్డ్ ఎదుర్కొని మైదానాన్ని వీడాల్సిన పరిస్థితి నెలకొంది. 10 మందితోనే ఆడినా అమెరికా మ్యాచ్ గెలిచింది కానీ, ఈ రెడ్ కార్డ్ తో డొమినోస్ సంస్థ ఇప్పుడు ఉచితంగా పిజ్జాలను పంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే, గత మే నెలలోనే డొమినోస్ ఒక వెరైటీ ప్రకటన చేసింది. ఈ వరల్డ్ కప్‌లో అమెరికా ప్లేయర్లలో ఎవరికైనా రెడ్ కార్డ్ వస్తే, తాము ఒక మిలియన్ డాలర్ల విలువైన పిజ్జాలను ఫ్రీగా పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు రెడ్ కార్డ్ రావడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది.
►ALSO READ | బ్యాట్ పట్టిన కోహ్లీ.. బంగార్‌తో కలిసి ప్రాక్టీస్, ఇంగ్లాండ్ వన్డేలకు రీఎంట్రీ ఖాయమేనా?
వారికే ఫ్రీ పిజ్జాలు.. క్లెయిమ్ చేసుకోండి ఇలా:
కంపెనీ (Dominos) వెల్లడించిన నిబంధనల ప్రకారం.. ఈ ఫ్రీ పిజ్జా ఆఫర్ అందరికీ వర్తించదు.. ఫ్రీ పిజ్జా పొందాలనుకునే ఫ్యాన్స్ ఎవరైనా సరే జూన్ 10వ తేదీలోపు డొమినోస్ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.. దాంతో పాటు సదరు కస్టమర్లు డొమినోస్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో కూడా తప్పకుండా ఎన్‌రోల్ అయి ఉండాలని చెప్పుకొచ్చింది. ఫ్రీ ఎమర్జెన్సీ పిజ్జా కోసం సెలక్టైనా లక్కీ విన్నర్స్, ఆ ఉచిత పిజ్జా ఆఫర్‌ను ఈ ఏడాది (2026) చివరి వరకు ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. ఈ క్రేజీ ఆఫర్ కింద డొమినోస్ సంస్థ ఒక మిలియన్ డాలర్ల విలువైన దాదాపు 60 వేల పిజ్జాలను ఫ్రీగా పంపిణీ చేయబోతుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పడిన ఒకే ఒక్క రెడ్ కార్డ్, ఇప్పుడు వేలాది మంది ఫ్యాన్స్ కి పండగలా మారింది.
