తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు

తైవాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు

తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీర ప్రాంతం అయిన కౌంటీ టైటుంగ్ లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూ ప్రకంపనల కారణంగా తైపీలో బిల్డింగులు కుప్పకూలినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పై 6.1 గా తీవ్రత నమోదయ్యింది. సుమారు 11.9 కిలోమీటర్ల మేర లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం సంభవించిన సమయంలో షాపింగ్ మాల్స్, ఇళ్లలోని వస్తువులు కింద పడుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు అధికారులు. ఇటీవల కాలంలో తైవాన్ లో తరచూ భూకంపాలు సంబవిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం. ఈ ఏడాది సంభవించిన భూకంపాల వల్ల ప్రాణనష్టం జరగకపోవడం గమనార్హం.

అయితే.. తైవాన్ లో 2016లో సంభవించిన భూకంపం కారణంగా వంద మందికి పైగా మరణించారు. 1999లో సంభవించిన భారీ భూకంపం కారణంగా రెండు వేల మందికి పైగా మరణించారు. ఇది తైవాన్ చరిత్రలో తీవ్ర విషాదం నింపిన ఘటనగా చెబుతారు.

►ALSO READ | రాహుల్‎ను ప్రధాని చేయడమే ప్రియాంక ఏకైక లక్ష్యం: డీకే శివకుమార్