రాహుల్‎ను ప్రధాని చేయడమే ప్రియాంక ఏకైక లక్ష్యం: డీకే శివకుమార్

రాహుల్‎ను ప్రధాని చేయడమే ప్రియాంక ఏకైక లక్ష్యం: డీకే శివకుమార్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్లు వినిపించడంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ప్రియాంక గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉంటారని పేర్కొన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ప్రియాంక గాంధీ ఏకైక లక్ష్యమని డీకే శివకుమార్ తెలిపారు. 

రాహుల్ గాంధీకి బదులు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంకా గాంధీని ఎంపిక చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇమ్రాన్‌ మసూద్‌ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ఎంపీ కామెంట్స్‎ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ రాహుల్ గాంధీని విమర్శించింది. రాహుల్ గాంధీపై సొంత పార్టీ నాయకులకు కూడా నమ్మకం లేదని.. ఆ పార్టీ ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని ఎద్దేవా చేసింది.

ALSO READ : ఇప్పటం నాగేశ్వరమ్మను కలిసిన పవన్ కళ్యాణ్..

ఈ క్రమంలో ఎంపీ ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తన సతీమణి ప్రియాంక ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఎంపీ ఇమ్రాన్‌ వ్యాఖ్యలను సమర్థించారు. రాజకీయాల్లో ప్రియాంక ముందడుగు వేయాలని తాను కూడా కోరుకుంటున్నానని తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ప్రకటించాలనే డిమాండ్లు ఎక్కువైతున్నాయి.