డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ( డిసెంబర్ 24 ) గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో పర్యటించారు. 2024 ఎన్నికలకు ముందు ఇప్పటం పర్యటన సందర్భంగా నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలికి ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ఇప్పటం గ్రామంలో పర్యటించారు పవన్. వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు పవన్. నాగేశ్వరమ్మకు కొత్త బట్టలు, రూ. 50 వేలు నగదు ఇచ్చారు పవన్.
దివ్యానంగుడైన నాగేశ్వరమ్మ మనవడికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు పవన్ . దీంతో పాటు తన ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెల రూ. 5 వేలు పెన్షన్ రూపంలో నాగేశ్వరమ్మకు ఇస్తానని హామీ ఇచ్చారు పవన్. అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కొడుకు కోసం రూ. 3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ ను అందజేశారు. నాగేశ్వరమ్మకు అన్ని రకాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ తన ఇంటికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది నాగేశ్వరమ్మ.
►ALSO READ | తిరుపతి అలిపిరి దగ్గర భారీ ట్రాఫిక్ జామ్.. చెక్ పాయింట్ దగ్గర బారులు తీరిన వాహనాలు....
2024 ఎన్నికలకు ముందు ఇప్పటంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ ను ఎన్నికల్లో గెలిచాక తమ గ్రామానికి రావాలని కోరారు నాగేశ్వరమ్మ. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇప్పటం గ్రామంలో పర్యటించారు పవన్ కళ్యాణ్.
