శాటిలైట్స్ టార్గెట్‌‌‌‌ గా చైనా కొత్త వెపన్.. 'హై పవర్ మైక్రోవేవ్’ వెపన్ తయారు చేసిన డ్రాగన్

శాటిలైట్స్ టార్గెట్‌‌‌‌ గా చైనా కొత్త వెపన్.. 'హై పవర్ మైక్రోవేవ్’ వెపన్ తయారు చేసిన డ్రాగన్

అంతరిక్షంలోని శాటిలైట్స్ టార్గెట్‌‌‌‌గా చైనా కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. దీని ద్వారా స్పేస్ఎక్స్ స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట్​వర్క్‌‌‌‌కు భూమి నుంచే అంతరాయం కలిగించవచ్చు... లేదా పూర్తిగా ధ్వంసం చేయవచ్చు.

బీజింగ్: అంతరిక్షంలోని శాటిలైట్స్ టార్గెట్‌‌గా చైనా కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. అత్యంత శక్తిమంతమైన హైపవర్ మైక్రోవేవ్ అనే వెపన్​ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా అంతరిక్షంలోని స్టార్ లింక్ వంటి శాటిలైట్ నెట్వర్క్‌‌కు అంతరాయం కలిగించవచ్చు. లేదా పూర్తిగా ధ్వంసం చేయవచ్చు. షాంగ్జీ ప్రావిన్స్‌‌లోని నార్త్‌‌వెస్ట్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ (ఎన్ఐఎన్టీ) శాస్త్రవేత్తలు టీపీజీ1000 సీఎస్ పేరుతో హైపవర్ మైక్రోవేవ్ వ్యవస్థను తయారు చేశారు. 

శాస్త్రవేత్తల ప్రకారం.. ఒక గిగావాట్ కంటే ఎక్కువ శక్తి కలిగిన గ్రౌండ్-బేస్డ్ మైక్రోవేవ్ ఆయుధం..  భూమి దిగువ కక్ష్యలో పనిచేసే స్టార్‌‌లింక్ వంటి ఉపగ్రహాలను దెబ్బతీసేంత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సిస్టమ్ 20 గిగావాట్ల (20 జీడబ్ల్యూ) శక్తిని ఒక నిమిషం పాటు కంటిన్యూగా ఉత్పత్తి చేయగలదు. దీనిని ట్రక్కులు, నౌకలు, విమానాలు, అంతరిక్షంలో కూడా ఏర్పాటు చేసేలా తయారు చేశారు. సాధారణ మైక్రోవేవ్ వ్యవస్థలు చాలా కొద్ది సెకన్లు మాత్రమే పనిచేస్తాయి. 

కానీ, చైనా తయారు చేసిన ఈ హైపవర్ మైక్రోవేవ్ వెపన్ ఒకే ఆపరేటింగ్ సెషన్‌‌లో 3,000 వరకు అధిక శక్తి గల మైక్రోవేవ్ పల్స్​లను అందించగలదని సైంటిస్టులు వెల్లడించారు. హైపవర్ మైక్రోవేవ్  ప్రధాన లక్ష్యం శాటిలైట్లు, డ్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని నాశనం చేయడమేనని సైంటిస్టులు పేర్కొన్నారు. అమెరికా ఉపగ్రహాలు తమ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని చైనా భావిస్తోంది. వాటిని అడ్డుకోవడానికే హైపవర్ మైక్రోవేవ్ వెపన్ తయారు చేసినట్లు తెలుస్తున్నది.