చెట్టును ఢీకొట్టిన మెడికల్ కాలేజీ బస్సు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఘటన

చెట్టును ఢీకొట్టిన మెడికల్ కాలేజీ బస్సు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఘటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థులను హాస్టల్‌కు తీసుకెళ్తున్న బస్సు శనివారం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. క్లాసులు ముగిసిన తర్వాత లక్ష్మీదేవిపల్లి హాస్టల్‌కు బయలుదేరిన బస్సులో సుమారు 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.

కాలేజీ గేటు దాటిన వెంటనే డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బస్సు ఢీకొట్టింది. బస్సు అద్దాలు పగిలి పలువురు మెడికోలకు గాయాలయ్యాయి. వారిని కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్​కు తరలించి చికిత్స అందించారు. డ్రైవర్‌కు కొంతకాలంగా ఫిట్స్ సమస్య ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.