టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన కామెంట్లపై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఏకంగా ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో నటి కరాటే కళ్యాణి ఆయనకు అండగా నిలిచింది. శివాజీ.. అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్జించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బ తింటుందని, పిల్లలు వాటిని చూసి పొడయ్యే అవకాశం ఉందని కల్యాణి ఆందోళన వ్యక్తం చేశారు.
"నా శరీరం నా ఇష్టం" అనడం సరికాదు..
శివాజీ పాలిష్ గా చెప్పలేకపోయి ఉండొచ్చు కానీ, ఆయన చెప్పినపాయింట్స్ లో నిజం ఉందన్నారు కళ్యాణి . ముఖ్యంగా నటి అనసూయ. సింగర్ చిన్మయిల స్పందనపై కల్యాణి ఘాటుగా స్పందించారు. "నా శరీరం నా ఇష్టం" అనడం సరికాదని, పబ్లిక్ ఫంక్షనకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలని హితవు పలికారు. "అనసూయ గారు.. మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా. రేపు వారు అసభ్యంగాదుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే మీకు ఇష్టమేనా? అంటూ సూటిగా ప్రశ్నించారు. కేవలం పాపులారిటీ కోసమే కొందరు ఈ విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.
శివాజీ క్షమాపణలు..
మరో వైపు హీరోయిన్స్ వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలపై శివాజీ క్లారిటీ ఇచ్చారు. ప్రెస్ మీట్‌లో శివాజీ మాట్లాడుతూ క్షమాపణలు కోరారు. ' దండోరా' మూవీ ఈవెంట్ లో తనకు తెలియకుండా కొన్ని పదాలు దొర్లాయి. నేను వాడిన ఆ రెండు 'అన్ పార్లమెంటరీ' పదాలకు గాను తెలుగు ఆడపడుచులందరికీ, టీవీలు , సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి ఒక్కరికీ చేతులెత్తి క్షమాపణలు చెబుతున్నాను. తప్పు చేసినప్పుడు సారీ చెప్పడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఇప్పటికే నా భార్యకు, నా కుటుంబ సభ్యులకు కూడా క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు..
►ALSO READ | Upendra : రజనీ సర్ పక్కన ఒక్క షాట్ చాలు.. 'కూలీ'లో తక్కువ నిడివిపై ఉపేంద్ర క్రేజీ కామెంట్స్
నా ఆవేదనకు కారణం ఆదే..
తాను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో శివాజీ వివరించారు. ఇటీవల లులూ మాల్ లో నిధి అగర్వాల్ పబ్లిక్‌గా ఎంత ఇబ్బంది పడిందో చూశాను. సమంత విషయంలోనూ అలాంటివే జరిగాయి. ఒకవేళ అనుకోకుండా బట్టలు జారితే ఆ వీడియోలు జీవితాంతం ఇంటర్నెట్‌లో ఉండిపోతాయి. ఆ హీరోయిన్లకు ఇబ్బంది ఎదురైనప్పుడు ఏ ఒక్కరైనా స్పందించారా? వారి పట్ల ఉన్న బాధ్యతతోనే నేను మాట్లాడాను తప్ప ఎవరినీ కించపరచాలని కాదు అని స్పష్టం చేశారు.
అనసూయకు సూటి ప్రశ్న..
ఈ వివాదంలోకి వచ్చిన నటి అనసూయను ఉద్దేశించి శివాజీ ఘాటుగా స్పందించారు. అనసూయ గారు.. మీరు ఇందులో ఎందుకు ప్రవేశించారు? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? నన్ను దోషిగా నిలబెట్టాలని చూస్తున్న వారికి నా వందనాలు. గతంలో ఎన్నో దారుణాలు జరిగినప్పుడు స్పందించని వారు, ఇప్పుడు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు...
