ఇక వీళ్లకు తిరుగే లేదు.. వరల్డ్ కప్ స్వ్కాడ్‎లో ప్లేస్ ఫిక్స్: విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో చెలరేగిన రోహిత్, కోహ్లీ

ఇక వీళ్లకు తిరుగే లేదు.. వరల్డ్ కప్ స్వ్కాడ్‎లో ప్లేస్ ఫిక్స్: విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో చెలరేగిన రోహిత్, కోహ్లీ

న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దుమ్మురేపారు. చాలా ఏండ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడిన ఈ ఇద్దరూ దిగ్గజాలు తొలి మ్యాచులోనే సెంచరీలతో చెలరేగారు. ముంబై తరుఫున బరిలోకి దిగిన రోహిత్ బుధవారం (డిసెంబర్ 24) సిక్కింతో జరిగిన మ్యాచులో భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. 94 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 155 పరుగులు చేశాడు. హిట్ మ్యాన్ సెంచరీతో కదం తొక్కడంతో సిక్కింపై ముంబై సునాయాస విజయం సాధించింది. 

సౌతాఫ్రికా ఫామ్ కంటిన్యూ:

దాదాపు 15 ఏండ్ల  తర్వాత తొలిసారి విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలో చేలరేగిన తన సూపర్ ఫామ్‎ను ఇక్కడ కొనసాగించాడు. బుధవారం (డిసెంబర్ 24) బెంగుళూరు వేదికగా ఏపీతో  జరిగిన మ్యాచులో కోహ్లీ శతకంతో చెలరేగాడు. తనకు ఎంతో ఇష్టమైన ఛేజింగ్‎లో సెంచరీ సాధించి ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు. ఈ సెంచరీ లిస్ట్ ఏ క్రికెట్‎లోకి కోహ్లీకి 58వది.

అలాగే.. ఈ మ్యాచులో విరాట్ మరో రికార్డ్ సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఇండియన్ క్రికెటర్‎గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో కోహ్లీ కంటే ముందు భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సచిన్ 21,999  పరుగులు చేసి తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక వీళ్లకు తిరుగే లేదు.. వరల్డ్ కప్ స్వ్కాడ్‎లో ప్లేస్ ఫిక్స్:

టీమిండియా సూపర్ స్టార్స్ కోహ్లీ, రోహిత్ అంతర్జాతీయ టెస్ట్, టీ20 ఫార్మాట్‎కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతోన్న వీరు.. బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లు కనీసం రెండు మ్యాచ్‌‎లు ఆడటం తప్పనిసరి కావడంతో ‘రోకో’ జోడీ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగారు. 

►ALSO READ | వైభవా మజాకా.. అతి తక్కు బాల్స్లో సెంచరీ.. దెబ్బకు మరో రెండు రికార్డ్స్ బ్రేక్ !

చాలా ఏండ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినప్పటికీ.. నేషనలైనా.. ఇంటర్నేషలైనా మాకు సంబంధంలే అన్నట్లు చెలరేగి ఆడారు. తొలి మ్యాచులోనే తమ తమ జట్లకు శతకాలతో ఘన విజయాన్ని అందించారు. కోహ్లీ, రోహిత్ సెంచరీలతో చెలరేగడంతో రోకో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక వీళ్లకు తిరుగే లేదు.. 2027 వరల్డ్ కప్ స్వ్కాడ్‎లో ప్లేస్ ఫిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.