మాదాపూర్ లోని తుమ్మిడికుంట, కూకట్ పల్లిలోని నల్ల చెరువుల అభివృద్ధి పనులు పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బుధవారం ( డిసెంబర్ 24 ) సిబ్బందితో కలిసి పర్యటించిన ఆయన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. చెరువుల్లోకి మురుగు నీరు నేరుగా చేరకుండా STPల ద్వారా శుద్ధి జలాలు మాత్రమే వచ్చేలా చూడాలని ఆదేశించారు. చెరువుల చెంత పార్కుల అభివృద్ధి, గ్రీనరీ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి చెరువును పర్యాటక ప్రాంతంలా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు రంగనాథ్.
చెరువులు పార్కుల దగ్గర సీనియర్ సిటిజన్లకు విశ్రాంతి సదుపాయాలు,చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియాల అభివృద్ధి చేయాలని అన్నారు.చెరువుల దగ్గర భద్రతకు ప్రాధాన్యమిస్తూ.. తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని.. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు.
►ALSO READ | కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వం.. ఇదే నా శపథం: సీఎం రేవంత్
చెరువుల ఇన్ లెట్లు, ఔట్ లెట్లు, వర్షపు నీటి ఛానళ్ల అభివృద్ధికి ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ రంగనాథ్. సంక్రాంతికి బతుకమ్మకుంట, తమ్మిడికుంట, నల్ల చెరువు, బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువుల వద్ద పతంగుల పండగ నిర్వహిస్తామని ప్రకటించారు రంగనాథ్.
