చావులోనూ వీడని స్నేహం... కాలువలో దూకిన వ్యక్తిని కాపాడబోయి.. ప్రాణాలు విడిచిన స్నేహితులు...

చావులోనూ వీడని స్నేహం... కాలువలో దూకిన వ్యక్తిని కాపాడబోయి.. ప్రాణాలు విడిచిన స్నేహితులు...

స్నేహం అంటే ఏంటో చెప్పడానికి చరిత్రలో చాలా సంఘటనులు, సినిమాలు, సినిమాల్లోని పాటలు ఉదాహరణగా చెప్పచ్చు. నిజ జీవితంలో కూడా స్నేహం విలువ ఏంటో చెప్పే ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కాలువలో దూకిన వ్యక్తిని కాపాడబోయి నీట మునిగి చనిపోయారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. బుధవారం ( డిసెంబర్ 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... 

క్రిస్మస్ పండగ సందర్భంగా సెలవులు కావడంతో చేపలు పట్టేందుకు వెళ్లారు ఇద్దరు స్నేహితులు అబ్బాస్, శశాంక్. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి కాలువలో దూకాడు.. నీటిలో కొట్టుకుపోతున్న ఆ వ్యక్తిని గమనించిన ఇద్దరు స్నేహితులు తమకు ఈత రాకపోయినా నీటిలో దూకారు. కాలువలో దూకిన వ్యక్తిని కాపాడిన ఇద్దరు స్నేహితులు..ప్రమాదవశాత్తు నీట  మునిగి చనిపోయారు ప్రాణస్నేహితులు.

ALSO READ : నేను తాగుబోతును అని మా ఇంట్లో చెబుతావా..!

ఘటనాస్థలం దగ్గర ఉన్న ప్రత్యక్ష సాక్షులు.. ఎవరో యువకుడు సాగర్ కాలువలో దూకి కొట్టుకుపోతుండగా కాపాడేందుకు అబ్బాస్, శశాంక్ దుకారని.. నీటి ప్రమాదకర స్థాయిలో ఉండటంతో ఇద్దరు నీట మునిగి చనిపోయారని అన్నారు. అబ్బాస్ శశాంక్ ల మరణంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చావులోనూ స్నేహం వీడని ఈ ఇద్దరు చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు గ్రామస్థులు.