మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న వ్యభిచార ముఠాగుట్టు రట్టు చేశారు కేపీహెచ్ బి పోలీసులు. స్థానిక అసాన వెల్ నెస్ స్పా సెంటర్‌పై అకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు 15 మంది యువతులను రక్షించడంతో పాటు, నిర్వాహకులు, విటులు కలిపి మొత్తం 30 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అసాన వెల్ నెస్ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. మసాజ్ పేరుతో యువతులను రప్పించి, వారి ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మసాజ్ సెంటర్ లోపల ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు దాడుల్లో వెల్లడైంది.
►ALSO READ | Vastu Tips: ఆర్థిక ఇబ్బందులకు ఇంటి ముఖద్వారం కారణమా.. గర్భవతులు గృహప్రవేశం చేస్తే నష్టాలొస్తాయా?
కేపీ హెచ్.బి 6వ ఫేజ్ లోని అసాన వెల్ నెస్ స్పా సెంటర్ పైన దాడులు నిర్వహించినట్లు సిఐ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తమకు సమాచారం అందడంతో ఫిబ్రవరి 13న రాత్రి స్పా సెంటర్ పై తనిఖీ నిర్వహించి 18 మంది కస్టమర్స్ తో పాటు 15 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ స్పా సెంటర్ నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ చేయడంతో పాటు ఎక్కడ కూడా నిబంధనలను పాటించడం లేదని అదేవిధంగా ఇందులో పనిచేసే కొంత మంది థెరపిస్ట్‌లు కి సరైన అనుభవం సర్టిఫికెట్ లేదని తమ దృష్టికి వచ్చిందని వీరి పైన క్రిమినల్ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. కేపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో నడుస్తున్న స్పా సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిబంధనలకు లోబడి సెంటర్లను నిర్వహించుకోవాలని సూచించారు లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఐ.
