నేను మాట్లాడితే.. నువ్వు రాయి కట్టుకుని మల్లన్న సాగర్ లో దూకుతావ్: కేసీఆర్‎ను దులిపేసిన సీఎం రేవంత్

నేను మాట్లాడితే.. నువ్వు రాయి కట్టుకుని మల్లన్న సాగర్ లో దూకుతావ్: కేసీఆర్‎ను దులిపేసిన సీఎం రేవంత్

హైదరాబాద్: ప్రభుత్వం తోలు తీస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నా తోలు తీయడం కాదు.. చింతమడక సర్పంచులే ఆయన తోలు తీస్తారని అన్నారు. చింతమడకలో చీరి చింతకు వేలాడిదీస్తారన్నారు. ఫ్యూచర్ సిటీ కడుతుంటే తొక్కా తోలు అంటారా.. ఓ మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడేది ఇదేనా అని ప్రశ్నించారు. 

సోయి లేని మాటలు.. స్థాయి లేని విమర్శలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ లాగా నేను మాట్లాడితే ఆయన నడుముకు రాయి కట్టుకుని మల్లన్న సాగర్‎లో దూకుతాడని అన్నారు. కేసీఆర్ నన్ను గెలకకు అని హెచ్చరించారు. నాకు కష్టం అంటే తెలుసు.. నాతో తమాషా వద్దని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నదా..? ఇదేమైనా ఆయన చేసినట్లు పాస్ పోర్టు దందా అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు.

►ALSO READ | న్యూ ఇయర్ వేళ సీఎం రేవంత్ గుడ్ న్యూస్: చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు, పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో నాపై 181 ఒక్క కేసులు పెట్టారు.. మేం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఆయనపై ఒక్క కేసు అయిన పెట్టానా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఎన్నో పాపాలు చేశారు.. ఒక్కరినైనా ఏమన్నా అన్నామా.. ఎవరి పాపాన వాడు పోతాడని సైలెంట్‎గా ఉన్నామన్నారు. మేం ప్రజల కోసం పని చేస్తున్నాం.. మా కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దని సూచించారు.