బీఆర్ ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకొని అప్పులకుప్పగా మార్చారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దోచుకొని 7లక్షల కోట్లు అప్పుల ఊబీలోకి నెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేస్తున్నామన్నారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ.. కాంగ్రెస్ తోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకచెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో 500 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. 3500 మంది ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించామన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.150 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తున్నామన్నారు ఎంపీ వంశీకృష్ణ.
మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిస్తున్నారని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. బెల్లంపల్లి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించరి రెండు వేల మంది నిరుద్యోగుల కు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఇసుక దందాలు, భూదందాలు చేసి దోచుకున్నారని ఆరోపించారు ఎంపీ వంశీకృష్ణ. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదన్నారు. పైగా ఉద్యోగాలిప్పిస్తామని ఎమ్మెల్యే లెటర్స్ కి కూడా డబ్బులు తీసుకున్న ఘతన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ది అని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ తోను మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి సాధ్యమవుతుంది.. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధి సహకరించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు.
