రికార్డ్ బ్రేక్ ఛేజింగ్.. 413 పరుగులు కొట్టేశారు: విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక సంచలనం

రికార్డ్ బ్రేక్ ఛేజింగ్.. 413 పరుగులు కొట్టేశారు: విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక సంచలనం

బెంగుళూరు: దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కర్నాటక సంచలనం సృష్టించింది. 413 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఔరా అనిపించింది. మరో15 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‎ను ఛేదించడం గమనార్హం. తద్వారా లిస్ట్ ఎ క్రికెట్ చరిత్రలో 400 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా కర్ణాటక నిలిచింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా తొలి స్థానంలో ఉంది. 2006లో జోహన్నెస్‌బర్గ్ వన్డేలో ఆస్ట్రేలియాపై 435 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించింది. 

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం (డిసెంబర్ 24) అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జార్ఖండ్‎తో జరిగిన మ్యాచులో కర్నాటక ఘన విజయం సాధించింది. దేవదత్ పడిక్కల్ సెంచరీతో (147) చెలరేగడంతో 413 పరుగుల భారీ స్కోర్‎ను కర్నాటక ఛేజ్ చేసింది. మరో 15 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లతో తేడాతో జార్ఖండ్‎ను చిత్తు చేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది.

►ALSO READ | ఇక వీళ్లకు తిరుగే లేదు.. వరల్డ్ కప్ స్వ్కాడ్‎లో ప్లేస్ ఫిక్స్: విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో చెలరేగిన రోహిత్, కోహ్లీ

జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 125 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అనంతరం 413 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన కర్నాటక మరో 10 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. పడిక్కల్ (147) సెంచరీతో దుమ్మురేపగా.. కెప్టెన్ మాయంక్ అగర్వాల్ (54) రాణించాడు. చివర్లో అభివన్ మనోహర్ (57), ధ్రువ్ ప్రభాకర్ (40) మెరుపులు మెరిపించి కర్నాటకను విజయతీరాలకు చేర్చారు.