Mrunal Thakur: "నేను అందంగా లేనని ఫీలయ్యేదాన్ని".. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ కామెంట్స్!

 Mrunal Thakur: "నేను అందంగా లేనని ఫీలయ్యేదాన్ని".. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ కామెంట్స్!

రొమాంటిక్ కామెడీ 'దో దివానే షహర్ మే' ప్రమోషన్ సందర్బంగా నటి మృణాల్ ఠాకూర్ తన మనసులోని భావాలను పంచుకుంది. సినిమాలో తన పాత్ర "నేను అందంగా లేను" అని చెప్పే డైలాగ్ తన జీవితానికి చాలా దగ్గరగా అనిపించిందని తెలిపారు. చిన్ననాటి నుంచి పోలికలు, తక్కువచూపు కారణంగా చాలామంది అమ్మాయిలే కాదు అబ్బాయిలూ అత్మవిశ్వాసం కోల్పోతారని, అదే అనుభూతి తనకూ ఉందని చెప్పారు. ఈ కారణంగానే సినిమాకు వెంటనే అంగీకరించానని వెల్లడిం చింది. 

 ఈ సినిమాలో ఈ  డైలాగ్ ను అభిమానులు 'జోక్'గా చూస్తున్నారన్న వ్యాఖ్యలకు స్పందించింది మృణాల్. "వాళ్లు నన్ను ఎలా చూస్తారో అది వేరు, నేను నన్ను ఎలా చూస్తానో అది వేరు" అంటూ నవ్వింది. 2025 వరకూ తన రూపంపై పూర్తి నమ్మకం లేదని, అప్పటి బ్యూటీ ప్రమాణాలకు తాను సరిపోనన్న భావన వెంటాడిందని చెప్పింది. కాలంతోపాటు అందం నిర్వచనం మారిందని వ్యాఖ్యానించారు. 

తాను నటుడు ధనుష్ తో డేటింగ్ లో ఉన్నానని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తపై మృణాల్ ఠాకూర్  తీవ్రంగా ఖండించారు.. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా తన పేరుతో మాటలు అంటగట్టారని, అది భయంగా అనిపించిందన్నారు. ఇద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ రూమర్లు వినిపిస్తున్నా... ఈ విషయంలో అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేశారు.