బంగ్లాదేశ్ పై దాడి చేస్తే ప్రతిదాడి చేస్తం..పాక్ యూత్ లీడర్ కమ్రాన్ సయీద్ ఉస్మానీ

బంగ్లాదేశ్ పై దాడి చేస్తే ప్రతిదాడి చేస్తం..పాక్ యూత్ లీడర్ కమ్రాన్ సయీద్ ఉస్మానీ

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) యువజన నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ భారత్​ను బెదిరించారు. బంగ్లాదేశ్ పై ఇండియా దాడిచేస్తే పాక్ సైన్యం, క్షిపణులు ప్రతిదాడి చేస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. “బంగ్లాదేశ్ పై భారత్ దాడి చేస్తే పాక్ సాయుధ దళాలు, మిలిటరీ ప్రతిదాడి చేస్తాయి. 

హిందూ రాజ్యాన్ని స్థాపించడానికి అఖండ భారత్ భావజాలం కింద బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను విచ్ఛిన్నం చేయడానికి భారత్​ ప్రయత్నిస్తున్నది. ఇటువంటి ప్రయత్నాలను పాకిస్తాన్ సహించదు. గతంలో భారత్ ను పాక్​క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది.. అవసరమైతే మళ్లీ అలా చేయగలదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనిక కూటమిని కట్టాలి. బంగ్లాదేశ్ లో పాకిస్తాన్, పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి” అని పేర్కొన్నారు