హైదరాబాద్లో విషాదం.. స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిందని యువకుడు సూసైడ్

హైదరాబాద్లో విషాదం.. స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిందని యువకుడు సూసైడ్

స్టాక్ మార్కెట్ నష్టాలతో సూసైడ్ చేసుకుంటన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కనీసం బేసిక్స్ తెలియకుండా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అయిన కొందరు.. ఇష్టం వచ్చినట్లు డబ్బులు పెట్టి నష్టపోతున్నారు. ఇన్వెస్ట్మెంట్ కు, ట్రేడింగ్ తేడా తెలియక.. సబ్జెక్ట్ తెలియక లక్షల్లో నష్టపోతున్నారు. శనివారం (ఆగస్టు 02) హైదరాబాద్ లో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.

రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ నియోజకవర్గం పీర్జదిగూడకు చెందిన పొలిశెట్టి రమేష్ (26) అనే యువకుడు గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నాడు. ట్రేడింగ్ లో నష్టాలు రావడంతో అప్పు తెచ్చి మరీ ట్రేడింగ్ కంటిన్యూ చేశాడు. ఎక్కడపోగొట్టుకునానో.. అక్కడే రాబట్టుకోవాలని అనుకున్నాడో ఏమో.. రివెంజ్ ట్రేడింగ్ మొదలు పెట్టాడు. అంటే పోయిన మొత్తాన్ని సంపాదించడం.. పోయినదానికంటే ఎక్కువగా సంపాదించడం అనే కసితో డబ్బులు పెట్టి పూర్తిగా అప్పులపాలయ్యాడు. 

   స్టాక్ మార్కెట్ లో నష్టాలు రావడం, అప్పులు పెరిగి పోవడంతో ఆందోళనతో శనివారం ఫ్యాన్ కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మేడిపల్లి పోలీసులు.

నోట్: స్టాక్ మార్కెట్ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ వేరు వేరు సబ్జెక్టులు. ఇన్వెస్ట్ చేస్తే లాస్ వచ్చినా కొన్నాళ్లకు రికవర్ అవ్వచ్చు కానీ.. ట్రేడింగ్ లో లాస్ అయితే అంతే సంగతులు. ఇంట్రా డే ట్రేడింగ్, కాల్స్, పుట్స్, క్వార్టర్లీ, మంత్రీ కాంట్రాక్ట్స్ అంటూ చాలా ఉంటాయి. ఎప్పుడు ఎంట్రీ కావాలి.. ఎప్పుడు ఎగ్జిట్ కావాలో తెలియాలంటే వివిధ రకాల కాన్సెప్టులు తెలియాల్సి ఉంటుంది. వీటితో పాటు క్యాండిల్స్ స్టిక్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్, గవర్నమెంట్ పాలసీలు.. ఇలా ఎన్నో అంశాలపై అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే రాణిస్తారు. అదికూడా వంద శాతం గ్యారెంటీ లేదు. అలాంటిది ఫ్రెండ్స్ చెప్పారనో.. యూట్యూబ్ సజెషన్స్ ద్వారానో ఏదో ఒక స్ట్రాటజీని గుడ్డిగా నమ్ముకుని ట్రేడింగ్ చేస్తే నష్టాలపాలు అవ్వాల్సి వస్తుంది. నష్టాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. అందులో ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడం తప్పు. అందుకే తెలియని ఫీల్డ్ లో గుడ్డిగా డబ్బులు పెట్టకండి. ఏదైనా ఉంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహా తీసుకోవడం మంచిది.