INDW vs AUSW 3rd T20:  భారత్ ఘన విజయం.. 2–1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్ కైవసం

INDW vs AUSW 3rd T20:  భారత్ ఘన విజయం.. 2–1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్ కైవసం

INDW vs AUSW 3rd T20:  అడిలైడ్ లోని ఓవల్‌ స్టేడియంలో జరిగిన 3వ  T20లో భారత్– ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి.  నిర్ణయాత్మకమైన మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి.. దీంతో సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళల జట్టు 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో స్మృతి మంధాన (55 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా, జెమిమా రోడ్రిగ్స్ (59) కూడా అర్థ శతకంలో టీం భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 

ఈ మ్యాచ్లో 177 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఆస్ట్రేలియాను 159/9 పరుగులకే టీమిండియా బౌలర్లు పరిమితం చేశారు. ఆష్లీ గార్డనర్ 57 హాఫ్ సెంచరీ చేయగా, లిచ్ఫీల్డ్ 26 దూకుడుగా ఆడినప్పటికీ ఆసీస్ ను మాత్రం గెలిపించడంలో విఫలమయ్యారు. వీరు ఇద్దరు మినహా మిగతా అందరూ బ్యాటర్లు తక్కువ పరుగులకే ఔట్ కావడంతో భారత్ ఈజీగా విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో శ్రీచరణి, శ్రేయాంక తలో 3 వికెట్లు, అరుంధతి రెడ్డి 2 వికెట్లు, రేణుక సింగ్ ఒక వికెట్ తీసుకుంది. ఆస్ట్రేలియా మహిళల జట్టుపై భారత్ ఘన విజయం సాధించడంతో పాటు ఈ సిరీస్ ని కైవసం చేసుకుంది. దీంతో ఆసీస్ గడ్డపై భారత్ మహిళల జట్టుకు ఇదే తొలి సిరీస్ విజయం.  

మ్యాచ్ అనంతరం భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ విజయంపై ఆనందంగా ఉంది. ఈ విజయం మాకు చాలా ప్రత్యేకమైనది.. ఇది పూర్తిగా టీమ్ ఎఫర్ట్.. ప్రతి ఒక్కరూ జట్టుకు ఏదో ఒక విధంగా సహకరించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.  జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన భాగస్వామ్యంపై సరైన సమయంలో వచ్చింది.. వారు ఇద్దరు జట్టుకు వారు పెద్ద బలంగా మారారు అని హర్మన్‌ప్రీత్ పేర్కొంది. ఇక మేం వికెట్లు తీసినప్పుడే మ్యాచ్ మన వైపు తిరుగుతుంది.. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టు వికెట్లు తీయడం అంత సులభం కాదు.. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్ల పడగొట్టడంతో ఈ మ్యాచ్ గెలిచామని వెల్లడించింది.  


భారత్ చేతిలో ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ సోఫీ మోలినెక్స్ మాట్లాడుతూ.. మంచి వికెట్‌పై టీమిండియాను కట్టడి చేశాం.. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడమే మాకు తీవ్ర నష్టం కలిగించిందని తెలిపింది. పెర్రీ కోసం ఈ మ్యాచ్ గెలవలేకపోయినందుకు కొంచెం బాధగా ఉంది.. ఆమె మాకు అందరికీ పెద్ద ఇన్స్పిరేషన్.. ఆమె మరెన్నో మ్యాచ్‌లు ఆడాలని కోరుకుంటున్నాం పేర్కొనింది. వచ్చే వన్డే సిరీస్‌లో అలీసా హీలీ జట్టులోకి రావడం మాకు పెద్ద ప్లస్ అవుతుంది.. ఆ సిరీస్‌లో పరిస్థితిని మార్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని సోఫీ మోలినెక్స్ చెప్పుకొచ్చింది.