T20 World Cup: రేపే పాకిస్తాన్–కివీస్ తొలి పోరు.. టోర్నీ నుంచి ఆసీస్ ఔట్.. ట్రోఫీ కొట్టనున్న పాక్? 

T20 World Cup: రేపే పాకిస్తాన్–కివీస్ తొలి పోరు.. టోర్నీ నుంచి ఆసీస్ ఔట్.. ట్రోఫీ కొట్టనున్న పాక్? 

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ స్టేజీలోనే నిష్క్రమించడంతో.. పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ హడావుడి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో పోస్టులు పెడుతూ, బీరాలు పలుకుతున్నారు. మెగా టోర్నీ నుంచి ఆసీస్ వైదొలిగితే పాక్ కు కలిగే లాభమేమిటి అనే దానిపై ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం.. 

తాజాగా పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఇంతగా హడావుడి చేయడానికి ఓ కారణం ఉంది.. ఐసీసీ మెగా టోర్నీల్లో, మరి ముఖ్యంగా ప్రపంచకప్ లాంటి ఈవెంట్స్ లో ఆసీస్ గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టిన సందర్భాల్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 1992 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నమెంట్లో పాక్ గెలిచి తొలిసారి జగజ్జేతగా అవతరించింది. 2009 టీ20 ప్రపంచకప్ లోనూ ఆసీస్ గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అప్పుడు కూడా పాకే విశ్వ విజేతగా నిలిచి, తొలిసారి పొట్టి ప్రపంచకప్ ఛాంపియన్స్ గా ఆవిర్భవించారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కంగారుల జట్టు గ్రూప్ దశలోనే వెళ్లడంతో.. ఆ మెగా టోర్నీలోనూ పాక్ ఛాంపియన్ గా నిలిచింది. 

తాజాగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 లోనూ ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లపోతుండటంతో, పాక్ అభిమానులు సెంటిమెంట్ రిపీట్ అవుతుందని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సెంటిమెంట్ ని ఆసరాగా చేసుకొని సోషల్ మీడియాలో సంకలు గుద్దుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాయాది జట్టు సూపర్-8కు వచ్చేందుకు చాలా కష్టం పడింది. గొసొంటి దుర్బర పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ఫ్యాన్స్ మాత్రం తామే ఈ ప్రపంచకప్ గెలుస్తామని గొప్పలు చేప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఏ టీం అయినా సరే ఛాంపియన్ గా నిలవాలంటే కనీస అర్హతలు అనేవి ఉంటాయి.. 

ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకు ఫైనల్ కు చేరే అర్హతలు లేవనే విషయం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు.. గ్రూప్ దశలో నెదర్లాండ్స్, యూఎస్ఏ వంటి చిన్న జట్లపై అతికష్టం మీద గెలిచి.. సూపర్-8లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక లాంటి టీమ్స్ ని దాటుకుని ఫైనల్ కి వెళ్లడం చాలా కష్టం అని చెప్పాలి. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే, పాక్ ట్రోఫీ గెలుస్తుందని చెప్పడం అసాధ్యం.. ఎందుకంటే పాక్ జట్టులో ప్రపంచకప్ ని గెలిపించేంత గొప్ప ఆటగాళ్లు ఏమీ లేరు. ఆ టీంలో మ్యాచ్ విన్నర్ వెతికితే కూడా ఒక్కడు కనిపించడు.. పైగా ఆ జట్టు స్టార్లుగా చెప్పుకేనే వారంతా ఫామ్ లోనూ లేరు.. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలవడం జరిగే పని మాత్రం కాదు. పాక్ ఫ్యాన్స్ ఈ దిక్కుమాలిన సెంటిమెంట్లను నమ్ముకొని గాల్లో మేడలు కడుతునే ఉంటారు.