మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన అల్లర్లపైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు చెన్నూర్ కాంగ్రెస్ నేతలు. మంత్రి వివేక్ ,ఎంపీ వంశీకృష్ణ జోలికొస్తే ఊరుకునేది లేదని బాల్కసుమన్ కు వార్నింగ్ ఇచ్చారు. మంత్రి వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించిన పట్టణ కాంగ్రెస్ నాయకులు.
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణపైన దాడులు చేసిన బాల్క సుమన్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలే లేకుండా చేసిన ఘనత బాల్కసుమన్ దని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగేలా చూసిన ఘనత మంత్రి వివేక్ వెంకటస్వామికి దక్కిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కానీ, బాల్క సుమన్ కానీ మరోసారి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ పైన తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
