కొలంబో: శ్రీలంక అండర్–19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్‌లో ఇండియా పైచేయి సాధించింది. బౌలర్లు చెలరేగడంతో.. రెండో రోజు మంగళవారం ఆట ముగిసే టైమ్‌కు లంక తొలి ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 122/8 స్కోరు చేసింది.
దుల్నిత్ సిగెరా (31), దిమంతా (24), విరాన్ చముదిత (21) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ప్రణవ్, చిగురుపాటి వెంకట, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో 411 రన్స్‌కు ఆలౌటైంది. కుశ్రాగ ఓజా (111), మనల్ చౌహాన్ (150) భారీ సెంచరీలతో చెలరేగారు.
