న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి. హనుమంతరావు కోరారు. మంగళవారం ఢిల్లీలో నేషనల్ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) చైర్పర్సన్ సాధ్వి నిరంజన్ జ్యోతిను కలిసి వినతిపత్రం అందజేశారు.
కేంద్ర జాబితాలో లేకపోవడం వల్ల రాష్ట్ర యువత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు, సంక్షేమ ఫలాలు కోల్పోతున్నారన్నారు. ఈ ప్రతిపాదనపై ఎన్సీబీసీ ఛైర్పర్సన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న సాంకేతిక అడ్డంకులను తొలగించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఓబీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వీహెచ్ తెలిపారు.
