జమ్మికుంట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని పాతర్లపల్లిలో భూభారతి రీ సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం మంగళవారం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టు కింద గ్రామంలో భూభారతి రీసర్వే చేపట్టనున్నట్లు అడిషన్కలెక్టర్ తెలిపారు. ఆధునిక సాంకేతిక ద్వారా నిర్వహించే రీసర్వే ద్వారా సరిహద్దు తగాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
పారదర్శకమైన భూ రికార్డులతో ప్రతి ఒక్కరికి తమ భూమిపై స్పష్టమైన హక్కులు లభిస్తాయని, ఈ ప్రక్రియకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తేజస్విని, ఆర్డీవో జల కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ రావు, తహసీల్దార్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
