Vishnu Vinyasam: రిలీజ్‌కు ముందే లాభాల్లో 'విష్ణు విన్యాసం'.. శ్రీవిష్ణు ఖాతాలో మరో క్రేజీ రికార్డు!

Vishnu Vinyasam: రిలీజ్‌కు ముందే లాభాల్లో 'విష్ణు విన్యాసం'.. శ్రీవిష్ణు ఖాతాలో మరో క్రేజీ రికార్డు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.  వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ మినిమమ్ గ్యారెంటీ హీరో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'విష్ణు విన్యాసం'. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా ఏ సినిమాకైనా థియేట్రికల్ వసూళ్లు వస్తేనే లాభాలు వస్తాయి. కానీ, శ్రీవిష్ణు సినిమా మాత్రం విడుదల కాకముందే కోట్లు లాభాలను గడించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

విడుదలకు ముందే ప్రాఫిట్!

ప్రస్తుత రోజుల్లో సినిమాను నిర్మించడం ఒక ఎత్తు అయితే, దానిని లాభాల్లోకి తీసుకురావడం మరో ఎత్తు. చాలా మంది నిర్మాతలు థియేటర్ రన్ మీదనే ఆశలు పెట్టుకుంటారు. కానీ 'విష్ణు విన్యాసం' విషయంలో మేకర్స్ చాలా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఈ చిత్రాన్ని సుమారు రూ. 19 కోట్ల వ్యయంతో నిర్మించారు. హీరో శ్రీవిష్ణుకు ఉన్న క్రేజ్ కారణంగా, ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి ఏకంగా రూ. 26 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది. దీంతో  ఈ సినిమా థియేటర్లలోకి అడుగుపెట్టక ముందే నిర్మాతలకు రూ. 7 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది. ఇక విడుదల తర్వాత వచ్చే వసూళ్లన్నీ అదనపు లాభాలే అని మేకర్స్ లెక్కలు వేస్తున్నారని సినీ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

ది కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్

శ్రీవిష్ణు గత చిత్రాలైన 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో ఆయన దిట్ట. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన సినిమా అంటే వెనుకాడకుండా పెట్టుబడి పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. 'విష్ణు విన్యాసం' టీజర్, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం, సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన 'ఆయ్' మూవీ ఫేమ్ నయన్ సారిక కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దర్శకడు యదునాథ్ మారుతీ రావు ఈ చిత్రాన్ని ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.  సుమంత్ నాయుడు జి ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.  తొలుత చిత్రాన్ని మార్చి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లా రిలీజ్ కానుంది. థియేటర్లలో విష్ణు చేయబోయే విన్యాసాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.