T20 World Cup: సౌతాఫ్రికాతో మ్యాచ్‌కి ముందు భారీ మార్పులు.. భారత జట్టులోకి విధ్వంసకర ప్లేయర్ 

T20 World Cup: సౌతాఫ్రికాతో మ్యాచ్‌కి ముందు భారీ మార్పులు.. భారత జట్టులోకి విధ్వంసకర ప్లేయర్ 

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్–8లో తమ తొలి మ్యాచ్ ని సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత జట్టు సిద్ధమవుతుంది. గత మూడు మ్యాచ్‌ల్లో మూడు సార్లు డకౌట్ కావడంతో అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై ఆందోళన కలిగిస్తుంది. ఈ ఫార్మాట్‌లో పవర్‌ప్లేలో మంచి ఆరంభాలు చాలా కీలకం, వరుసగా వికెట్లు కోల్పోవడం భారత్‌కు ప్రమాదకరం కావడంతో.. మరో ఆటగాడిని తుది జట్టులోకి తీనుకునే విషయంపై జట్టు  మేనేజ్మెంట్ తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.  
 
అభిషేక్‌ను తక్షణమే తప్పించే అవకాశం ఉన్నప్పటికీ.. ఐసీసీ టోర్నీల్లో యువ ఆటగాళ్లకు కష్టకాలంలో అండగా నిలవడం భారత్‌కు గతంలో అనేకసార్లు మంచి ఫలితాలు వచ్చాయి. మరోవైపు, అతని స్థానంలో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉన్న సంజూ శాంసన్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఏం లేడు.. అభిషేక్ అనారోగ్యంతో తప్పుకున్నప్పుడు సంజూకు దక్కినా ఛాన్స్ ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఈ దశలో ప్రయోగాలకంటే తుది జట్టునే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.  కీలక మ్యాచ్‌లోనైనా అభిషేక్‌కు మరో అవకాశం ఇస్తే.. ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటుంది.  

పేలవంగా భారత బౌలింగ్: 
భారత్ బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా ఏం లేదు.. వరుణ్ చక్రవర్తి మాత్రం వండర్ ఫుల్ బౌలింగ్ చేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో పరుగుల్ని నియంత్రిస్తూ కీలకమైన వికెట్లు పడగొడుతున్నాడు. మిగతా బౌలర్లు అనవసరంగా పరుగులు ఇస్తున్నారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనఫ్ కలిగిన జట్లపై ఇలాంటి తప్పులు గానీ చేస్తే, సెమీస్ చేరే అవకాశాలు దాదాపు గల్లంతు అయినట్లే.. కాబట్టి, సూపర్–8 దశలో మరింత కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంపై భారత జట్టు ఫోకస్ పెట్టాల్సి ఉంది.  

అక్షర్ రీఎంట్రీ: 
దక్షిణాఫ్రికాతో జరిగే తొలి సూపర్–8 మ్యాచ్‌లో అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కి అతను దూరమైనప్పటికీ, లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కోసం అక్షర్ ని తుతి జట్టులోకి తీసుకుంటే.. వాషింగ్టన్ సుందర్‌కు విశ్రాంతి దక్కే అవకాశం కనిపిస్తుంది.  

రింకు ఫ్యాక్టర్: 
భారత జట్టులో మరిన్ని మార్పులు చేస్తారా అనే చర్చ కూడా కొనసాగుతుంది. రింకు సింగ్‌ను తప్పించే అవకాశం చాలా తక్కువగా ఉంది. అతనికి ఇప్పటి వరకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. అది ఫామ్ కారణంగా కాకుండా మ్యాచ్ పరిస్థితుల వల్లే.. కీలక మ్యాచ్‌ల్లో నమ్మకమైన ఫినిషర్ గా.. ఒత్తిడిలోనూ మ్యాచ్ ముగించే సామర్థ్యం రింకు ఇప్పటికే నిరూపించుకున్నాడు. పైగా, శివమ్ దూబే బౌలింగ్ చేయడంతో భారత్‌కు బ్యాటింగ్ చేయగల సత్తా, ఆరో బౌలర్ ఆప్షన్ జట్టుకు లభిస్తోంది.  
 
టీమిండియా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. గెలిచే మార్గాన్ని మాత్రం సెలక్ట్ చేసుకుంటుంది. దక్షిణాఫ్రికా మాత్రం బ్యాటింగ్, జింబాబ్వే ఆత్మవిశ్వాసం, వెస్టిండీస్ పవర్ హిట్టింగ్‌ భారత్ కి ముప్పుగా మారే అవకాశం ఉంది. బౌలింగ్‌ను కట్టుదిట్టం చేసి, టాప్ ఆర్డర్ బ్యాటర్లు మంచి ఆరంభాలు ఇస్తే భారత్ మళ్లీ స్ట్రాంగ్ టీమ్ గా పోటీలో నిలుస్తుంది. లేదంటే, ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ గాల్లో కలిసిపోతాయి.  
భారత జట్టు అంచనా: 
అభిషేక్ శర్మ/ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్/ వాషింగ్టాన్ సుందర్, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్/ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.