రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ ఈ వేడుకను వేదిక కానుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు ఏడడుగులు వేయనున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.
వెటకారపు వ్యాఖ్యలతో..
అయితే ఈ కొత్త జంట వివాహబంధంలోకి అడుగుపెడుతున్న వేళ నటి రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తనకు ఇంకా ఆమె పెళ్లి ఆహ్వానం అందలేదని, ఒకవేళ వస్తే వెళ్తానని చెప్పారు. అయితే తమను పిలపదని కూడా తెలుసంటూ వెటకారంగా మీడియాతో మాట్లాడాడు. ఇక రష్మిక, రక్షిత్ నిశ్చితార్థం తర్వాత బ్రేకప్ గురించి మాట్లాడుతూ, రక్షిత్ శెట్టి చాక్లెట్ తింటూ బాధపడే చిన్న పిల్లాడు కాదు ఆని వ్యాఖ్యానించారు..
రష్మిక ఫ్యాన్ సీరియస్..
రష్మిక తన తొలి కన్నడ సినిమా కిరిక్ పార్టీలో రక్షిత్, ప్రమోద్ శెట్టిలతో కలిసి నటించింది. ఈసినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఆ సమయంలోనే రక్షిత్ తో ఆమె ప్రేమలో పడింది. అయితే నిశ్చి తారం అనంతరం కెరీర్ కోసం తన నిర్ణయం మార్పు కోవడం చర్చకు వచ్చింది. ప్రమోద్ వ్యాఖ్యలు రష్మిక అభిమానులకు , నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. గతంలో ముగిసిపోయిన విషయాలను ఇప్పుడే గుర్తు చేయాల్సిన అవసరం ఏమిటని నిలదీస్తున్నారు.
పెళ్లికి ముందు యాడ్ షూట్
వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముందు ఒక ప్రముఖ బ్రాండ్ కోసం విజయ్, రష్మిక కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో వీరు ఒక బాత్ సోప్ యాడ్ కోసం కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ ప్రకటనలో వీరు నవ దంపతులుగా కనిపించి అందరినీ మెప్పించారు. ఇప్పుడు చేయబోయే కొత్త యాడ్‌లో వీరి కెమిస్ట్రీ మరింత పీక్స్‌లో ఉంటుందని, షూటింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్స్‌ను వాడుతున్నారని టాక్. ఈ యాడ్ షూటింగ్ పూర్తయిన వెంటనే వారు పెళ్లి పనుల్లో బిజీ అయిపోతారు.
►ALSO READ | VijayRashmika: పెళ్లికి ముందే రొమాంటిక్ యాడ్ షూట్.. విజయ్, రష్మికల వెడ్డింగ్ ప్లాన్ ఇదే!
గ్రాండ్ గా రిసెప్షన్!
ఉదయ్‌పూర్‌లో వివాహం ముగిశాక, మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో రష్మిక, విజయ్ పెళ్లి రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి, రీల్ లైఫ్‌లో అద్భుతమైన కెమిస్ట్రీని పండించిన ఈ జంట.. ఇప్పుడు నిజ జీవితంలోనూ జంటగా మారబోతుండటం చూస్తుంటే అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
