న్యూఢిల్లీ: భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ కోచ్ అవతారమెత్తాడు. ప్రముఖ టెక్ కంపెనీ గుగూల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చాడు గిల్. పుల్ షాట్ ఎలా ఆడాలో సుందర్ పిచాయ్‌కు నేర్పించాడు. ఈ ఆసక్తికర ఘటన న్యూఢిల్లీలోని గుర్గావ్లో చోటు చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ సమ్మిట్‌కు ప్రపంచంలోని అగ్రశేణి టెక్ కంపెనీల బాస్‌లు, సీఈవోలు హాజరయ్యారు. ఈ క్రమంలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని గుర్గావ్లో ఇండియా గూగుల్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇండియా పర్యటనలో ఉన్న పిచాయ్ ఈ ఈవెంట్‌కు హాజరయ్యాడు.
భారత స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశాడు. క్రికెట్లో బెస్ట్ షాట్లలో ఒకటైన పుల్ షాట్ ఎలా ఆడాలో పిచాయ్‌కు నేర్పించాడు గిల్. పుల్ షాట్ ఆడే సమయంలో బాడీ బ్యాలెన్స్, బ్యాట్ స్వింగ్, ఫుట్ వర్క్ ఎలా ఉండాలో వివరించాడు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే సుందర్ పిచాయ్ గిల్ చెబుతున్నప్పుడు ఒక పక్కకు నిలబడి చాలా శ్రద్ధగా విన్నాడు.
సుందర్ పిచాయ్‌కు గిల్ క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచ టాప్ టెక్ కంపెనీ సీఈవోకి భారత కెప్టెన్ ట్రైనింగ్ ఇవ్వడం సంతోషంగా ఉందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. సుందర్ పిచాయ్ తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. వరల్డ్‌లోనే టాప్ కంపెనీకి బాస్ అయ్యిండి కూడా గిల్ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు చేతులు కట్టుకుని ఒక పక్కకు నిలబడి శ్రద్ధగా వినడం గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు.
🚨 Shubman Gill teaching Sundar Pichai how to play pull shot, he is explaining like a professional coach. 😂🔥 pic.twitter.com/eRKY4zkK75
— Ahmed Says (@AhmedGT_) February 21, 2026
