Shalini Ajith : అజిత్-విజయ్ శత్రువులా? మిత్రులా?.. విభేదాలపై షాలిని షాకింగ్ క్లారిటీ!

Shalini Ajith : అజిత్-విజయ్ శత్రువులా? మిత్రులా?.. విభేదాలపై షాలిని షాకింగ్ క్లారిటీ!

తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నవారు తల అజిత్ కుమార్, దళపతి విజయ్..  ఈ ఇద్దరి పేర్లు వినబడితే చాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రకంపనలు మొదలవుతాయి. వీరి సినిమాలు వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న పోటీ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. అది అభిమానుల మధ్య ఒక పెద్ద యుద్ధంగా మారింది. రికార్డులు, కలెక్షన్లు, ఫస్ట్ డే ఓపెనింగ్స్.. ఇలా ప్రతి విషయంలోనూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటూనే ఉంటారు. అజిత్ కుమార్, విజయ్ ల మధ్య విభేదాలు ఉన్నాయంటూ చాలా కాలంగా పుకార్లు కూడా వచ్చాయి.

అజిత్-విజయ్ మిత్రులే!

అయితే  ఇటీవల జరిగిన JFW మూవీ అవార్డ్స్ వేడుకలో అజిత్ భార్య, మాజీ నటి షాలిని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.అజిత్ , విజయ్ మధ్య ఉన్న అనుబంధం గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు ఎంతో హుందాగా సమాధానమిచ్చారు. అజిత్, విజయ్ మధ్య ఉన్న బంధం చాలా అందమైనది. వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. నిజానికి, ఒకరి సాధించిన విజయాలను చూసి మరొకరు ఎంతో సంతోషిస్తారు. మేమందరం ఒకరి సక్సెస్‌ను చూసి మరొకరం గర్వపడతాం అని ఆమె పేర్కొన్నారు. షాలిని చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించాయి. బయట ప్రపంచానికి వీరిద్దరూ ప్రత్యర్థులుగా కనిపిస్తున్నా, తెర వెనుక మాత్రం ఒకరినొకరు గౌరవించుకునే మంచి స్నేహితులని షాలిని మాటల్లో మరోసారి స్పష్టమైందని అభిమానులు సంబరపడుతున్నారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JFW Binge (@jfwbinge)

చిక్కుల్లో'జన నాయకన్' 

ప్రస్తుతం విజయ్ తన దృష్టిని పూర్తిగా రాజకీయాలపై పెట్టారు. సినిమాలకు గుడ్ బై చెబుతూ ఆయన నటించి ఆఖరి చిత్రం 'జన నాయకన్' . ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సెన్సార్ చిక్కులతో విడుదల వాయిదా పడింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ .. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఒక దత్తత తీసుకున్న కుమార్తెను స్వతంత్రంగా పెంచే తండ్రిగా, దేశానికి ఎదురయ్యే ముప్పును అడ్డుకునే పోరాట యోధుడిగా విజయ్ విశ్వరూపం చూపించబోతున్నారు.  ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు వంటి తారలు నటిస్తున్నారు.  త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.

'AK64' - హై-వోల్టేజ్ యాక్షన్!

మరోవైపు అజిత్ తన స్టైలిష్ యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్నారు. 'విడాముయర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల తర్వాత అజిత్ తన 64వ సినిమా (AK64) కోసం సిద్ధమవుతున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ ప్రాజెక్టులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఇది కంప్లీట్ మాస్ అండ్ క్లాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది.