
ఏపీలో జాతీయ రహదారులకు శంకుస్థాపన సందర్భంగా శనివారం ( ఆగస్టు 2 ) మంగళగిరిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భారత సింహం ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కలయికలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. గడ్కరీ రాజాకీయ నాయకులకు ఇన్స్పిరేషన్ అని.. పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ఎలా నిలబడాలి అనేది పవన్ ను చూసి నేర్చుకోవాలని అన్నారు రామ్మోహన్ నాయుడు.
ఏపీలో ప్రతి రోజు 30 కిమి హైవే నిర్మాణం జరుగుతోందని అన్నారు. సరైన నాయకత్వం ఏపిలో గతంలో లేకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదని అన్నారు. ఇవాళ బండి తీస్తే మామిడి కాయలు తొక్కుకుంటు నాయకులు వెళ్తూన్నారు,లేకపోతే మనుషులను తొక్కుకుంటు వెళ్తున్నారు, మొత్తంగా రాష్ట్రాన్ని తొక్కుకుంటూ వెళ్తున్నారని వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి రామ్మోహన్ నాయుడు.
రోడ్ల బడ్జెట్ ను రూ. 3 లక్షల కోట్లకు తీసుకెళ్లిన ఘటన గడ్కరిదే అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అండగా నిలబడిందని అన్నారు. విశాఖ రైల్వే జోన్ కు వేగంగా అడుగులు పడుతున్నాయని అన్నారు. గతంలో చేయలేని అభివృద్ధి ఇవాళ ఎలా చేస్తున్నామో ప్రజలు ఆలోచించాలని అన్నారు రామ్మోహన్ నాయుడు.