సికింద్రాబాద్ రైల్వే జోన్ లో జాబ్ల జాతర : గ్రూప్ డి పోస్టులు.. పది పాసైతే చాలు ..

 సికింద్రాబాద్ రైల్వే జోన్ లో జాబ్ల జాతర :  గ్రూప్ డి పోస్టులు..  పది పాసైతే చాలు ..

 

దేశవ్యాప్తంగా ఉన్న 16 రైల్వే జోన్ల పరిధిలో గ్రూప్–డి పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (ఆర్ఆర్ బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి లేదా ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ జనవరి 31న ప్రారంభమైనది. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 02. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 


ఖాళీలు: 22,195.


దక్షిణ మధ్య రైల్వేలో జోన్ (సికింద్రాబాద్) పరిధిలో ఖాళీలు: అసిస్టెంట్ బ్రిడ్జి 01, అసిస్టెంట్ క్యారేజ్, వ్యాగన్ 22, అసిస్టెంట్ ఆపరేషన్స్ 10, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 20, అసిస్టెంట్ పి.వే 39, ట్రాక్ మెయింటైనర్–IV 653, అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ) 75, అసిస్టెంట్ ట్రాక్ మెషీన్ 29, పాయింట్స్ మన్ బి 128, అసిస్టెంట్ టీఆర్ డీ 35. 

ఎలిజిబిలిటీ

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి10వ తరగతి ఉత్తీర్ణత (మెట్రిక్యులేషన్/ ఎస్ఎస్ సీ/ ఎస్ఎస్ఎల్ సీ) లేదా
  • గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) సర్టిఫికెట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్​సీవీటీ) జారీ చేసి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ (ఎన్ఏసీ) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • పరీక్షలు రాసి తుది ఫలితాల కోసం వేచి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు కారు.
  • ఐటీఐకు బదులుగా ఇంజినీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు కారు.

వయోపరిమితి 

కనీస వయసు: 18 ఏండ్లు. 
గరిష్ట వయసు: 33 ఏండ్లు. 
ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు, మాజీ సైనికులకు (సైనిక సేవను మినహాయించిన తర్వాత) మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 31.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీలకు రూ.250.
లాస్ట్ డేట్: మార్చి 02. 
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.rrbapply.gov.in  వెబ్​సైట్​ను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్

కంప్యూటర్ బేస్డ్ టెస్టులో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.  

►ALSO READ | ఆయుష్ డొమైన్ ఎక్స్ పర్ట్ పోస్టులు భర్తీ .. నోటిఫికేషన్ రిలీజ్

ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీతోపాటు 13 స్థానిక భాషల్లో ఇస్తారు. జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, మ్యాథమెటిక్స్​ 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, జనరల్ అవేర్​నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు 20 మార్కులకు అడుగుతారు. నెగెటివ్  మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

కనీస అర్హత మార్కులు: అన్​రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 40 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 2 మార్కులు తగ్గింపు ఉంటుంది.