హైదరాబాద్ జీడిమెట్లలో పీజీ హాస్టల్లో దూరి.. ల్యాప్టాప్ లు చోరీ.. ఇద్దరు అరెస్ట్...

హైదరాబాద్ జీడిమెట్లలో  పీజీ హాస్టల్లో దూరి.. ల్యాప్టాప్ లు చోరీ.. ఇద్దరు అరెస్ట్...

జీడిమెట్ల, వెలుగు: పీజీ హాస్టల్లో దూరి ల్యాప్​టాప్​లు దొంగతనం చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన గంగనమోని అన్వేశ్ కుమార్ (20) కొంపల్లిలోని ఎక్సలెంట్ బాయ్స్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. సికింద్రాబాద్​కు చెందిన మయూర్ అశోక్ మేవాడ (46) బిజినెస్ చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి జనవరి 24న బహదూర్​పల్లిలోని ఓ పీజీ హాస్టల్లో రెండు,  26న మరో ఐదు ల్యాప్ టాప్​లు ఎత్తుకెళ్లారు. 

బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆదివారం బహదూర్​పల్లి క్రాస్​రోడ్స్​లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అన్వేశ్, అశోక్​ను​ అరెస్ట్ చేశారు. వారి నుంచి 7 ల్యాప్​​టాప్​లు రికవరీ చేశారు.