
హైదరాబాద్, వెలుగు: గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో భారీగా ఆఫర్లు ఇస్తున్నామని ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ ప్రకటించింది. 5జీ స్మార్ట్ఫోన్లు రూ.7,999 నుంచి అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 15 రూ.57,249లకు. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా రూ.79,999కు లభి స్తున్నాయి. ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, కెమెరాలపై 70శాతం వరకు తగ్గింపు ఉంది.
యాపిల్ ఐపాడ్ ఎయిర్ రూ.58,490లకు, శామ్సంగ్ గెలాక్సీ ట్యాచ్ఎస్ ఎఫ్త రూ.34,999కి లభిస్తున్నాయి. స్మార్ట్ టీవీలపై 65శాతం వరకు, వాషింగ్ మెషీన్లు, ఏసీలపై 60శాతం వరకు డిస్కౌంట్ వస్తోంది. శామ్సంగ్ టీవీల ధరలు రూ.13,990 నుంచి మొదలవుతాయి.
దుస్తులు, చెప్పులపై 50శాతం నుంచి 80శాతం వరకు తగ్గింపు ఉంది. బ్యూటీ ప్రొ డక్టులు రూ.599 లోపు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్లో నో కాస్ట్ఎంఐ సదుపాయాన్ని కూడా కస్టమర్లు ఉపయోగించుకోవచ్చని,ఎస్బీఐ క్రెడిట్ కార్డతో కొంటే అదనంగా 10శాతం డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది.